పార్టీ ఎంపీలతో నేడు సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ | CM YS Jagan meeting with YSRCP MPs today | Sakshi
Sakshi News home page

పార్టీ ఎంపీలతో నేడు సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

Published Mon, Jan 25 2021 3:11 AM | Last Updated on Mon, Jan 25 2021 3:22 AM

CM YS Jagan meeting with YSRCP MPs today - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయంలో భేటీ కానున్నారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా చర్చిస్తారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ఏయే అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలో సీఎం దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

కేంద్రం ఇవ్వాల్సిన నిధులను రాబట్టేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. మరోవైపు ప్రత్యేక హోదా సాధనకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీనిపైనా ఎంపీల సమావేశంలో చర్చించే వీలుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement