
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న పలువురు ఎంపీలకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తంగా 17 మంది ఎంపీలకు కరోనా సోకినట్లు తేలింది. అత్యధికంగా బీజేపీకి చెందిన 12 మంది ఎంపీలు కరోనా బారిన పడినట్లు పరీక్షల్లో బయటపడింది. అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, శివసేన, డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కళగం), ఆర్‌ఎల్‌పీ(రాష్ట్రీయ లోక్‌తంత్రిక్ పార్టీ) ఎంపీలు ఒక్కొక్కరు చొప్పున మహమ్మారి బారిన పడినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.(చదవండి: ఆర్థిక మంత్రిపై తృణమూల్ వ్యక్తిగత వ్యాఖ్యలు)
కాగా దేశంలో కోవిడ్-19 విజృంభణ కొనసాగుతున్న వేళ ప్రత్యేక పరిస్థితుల నడుమ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 24 మంది ఎంపీలకు, 8 మంది కేంద్రమంత్రులకు కరోనా సోకినట్లు తేలగా.. తాజాగా మరో 17 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో వైరస్ స్వల్ప లక్షణాలు ఉన్నా.. సభలోకి అనుమతి లేదని స్పీకర్ ఇదివరకే ప్రకటించారు. (చదవండి: ప్రశ్నోత్తరాల రద్దుపై విపక్షాల ఆందోళన)
Comments
Please login to add a commentAdd a comment