'అగస్టాపై చర్చకు మేం సిద్ధం'
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైంది మొదలు అధికార, ప్రతిపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. అక్రమంగా రాష్ట్రపతి పాలన విధించారంటూ కేంద్ర ప్రభుత్వంపై కత్తి దూసి సమావేశాలు అడ్డుకుంటుండగా.. దేశాన్ని ఓ కుదుపు కుదిపిన అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలని కేంద్రం వ్యూహం సిద్ధం చేసింది.
అయితే, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి బుధవారం ఉదయం అగస్టాపై చర్చకు సిద్దమని స్పష్టం చేశారు. తన పార్టీ నేతలతో కలిసి సుదీర్ఘంగా చర్చించిన ఆమె ఈ అంశంపై తాము కూడా చర్చకు సిద్ధమని, నిందితులు ఎంతపెద్దవారైనా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతకుముందు లోకసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు.