Augusta
-
పాకిస్తాన్‌కు ఫ్రాన్స్ షాక్
పారిస్: పాకిస్తాన్‌కు ఫ్రాన్స్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశానికి గతంలో విక్రయించిన మిరేజ్ యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థ, అగోస్టా 90బీ జలాంతర్గాములను ఆధునీకరించకూడదని ఫ్రాన్స్ నిర్ణయించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తీరును తప్పుపడుతూ పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. తమ దేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేస్తామని మేక్రాన్ ప్రకటించడమే ఇందుకు కారణం. పాక్ తీరుతో ఆగ్రహంతో ఉన్న ఫ్రాన్స్ మిరేజ్ యుద్ధ విమానాలను అప్‌గ్రేడ్ చేయరాదని నిర్ణయానికి వచ్చింది. ఖతార్‌కు ఫ్రాన్స్ రఫేల్ ఫైటర్ జెట్లను విక్రయించింది. ఈ జెట్ల సర్వీసింగ్‌కు పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న నిపుణులకు నియమించరాదని ఖతార్‌ను ఆదేశించింది. ఆశ్రయం కోరుతూ పాకిస్తాన్ పౌరుల నుంచి అందుతున్న విజ్ఞప్తులను ఫ్రాన్స్ పక్కనపెడుతోంది. -
కుక్కపిల్లతో చిన్నారి డ్యాన్స్..
-
వైరల్ : ఈ డ్యాన్సింగ్ జోడీ అదిరింది
కరోనా కారణంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కూడా ఒకరకంగా మూగబోయింది. ప్రపంచం నలుదిక్కులా కరోనా పేరు మారుమ్రోగుతుండటంతో వైరల్ న్యూస్‌కు కరువొచ్చింది. దీంతో ఇంటికి పరిమితమైన వారికి ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌తో సంబంధంలేని ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్ల పెదాలపై నవ్వులు పూయిస్తోంది. ఇంతకీ సంగతేంటంటే.. మైనేకు చెందిన ఓ చిన్నారి తన కుక్కపిల్లతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసింది. అచ్చం ఎలుగు బంటిలాగా ఉన్న ఆ కుక్కపిల్ల ఎంతో సంతోషంగా చిన్నారితో ఆడింది. పాపను విడిచిపెట్టకుండా గంతులేసింది. చిన్నారి తల్లి కారీ లేవన్ ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉంచారు. ( వైరల్ అవుతున్న ట్రాఫిక్ పోలీసుల వీడియో) మంగళవారం పోస్టైన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దాదాపు 5 మిలియన్ల వ్యూస్.. 3 లక్షల లైక్స్ సంపాదించింది. నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. ‘‘ చాలా అందంగా ఉంది! డ్యాన్స్ చేస్తున్నది కచ్చితంగా ఎలుగుబంటి కాదు కదా?.. అది ఏ జాతి మనిషి .. ఆ అదే కుక్క.. ఆ కుక్క ఎంతో సంతోషంగా ఉంది. ఆ ఇద్దరూ కొన్ని వారాల ముందునుంచే ప్రాక్టీస్ చేశారనుకుంటా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( వావ్.. వాటే బ్యూటీ.. ఐష్ జిరాక్సే ) -
‘నాకోసమైనా వారిని కాపాడాలి’
అగస్టాలో సోనియా, రాహుల్‌లపై మధ్యవర్తి మిచెల్ దుబాయ్: అగస్టా కుంభకోణంలో మధ్యవర్తిగా ఉన్న మిచెల్ క్రిస్టియన్ తనెప్పుడూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌లను కలవలేదని స్పష్టం చేశారు. ఎన్డీటీవీకి దుబాయ్ నుంచి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. గాంధీ కుటుంబానికి ఈ ముడుపులతో సంబంధం లేదని వెల్లడించారు.‘హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునేది సోనియా గాంధీయేనని తెలుసు. అందుకే ఓ లేఖలో ‘ద డ్రైవింగ్ ఫోర్స్’గా సోనియాను పేర్కొన్నాను. అంతకుమించి సోనియా, రాహుల్‌లను నేనుప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు. వారితో లాబీయింగ్ చేయించాలని ప్రయత్నించినా కుదరలేదు’ అని మిచెల్ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘ఈ కుంభకోణంతో వారికి సంబంధం లేదని నిరూపించటం ద్వారా నేను అమాయకుడనని నిరూపించుకోవాలి’ అని అన్నారు. భారత ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని మధ్య న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో అగస్టా కేసుకు సంబంధించిన సమాచారం ఇస్తే.. ఇటాలియన్ నావికుల విడుదల చేస్తామని మాట్లాడుకున్నారంటూ గతంలో తను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మిచెల్ వెల్లడించారు. మిచెల్‌తోపాటు జైల్లో ఉన్న ఇద్దరు అగస్టా ప్రతినిధులు రాసిన లేఖలు, దీనిపై ఇటలీ కోర్టులో విచారణ ఆధారంగా హెలికాప్టర్ల స్కాంకు సంబంధిం చి భారత్‌లో ముడుపులు అందినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. దీన్ని కాంగ్రెస్‌పై అస్త్రంగా మార్చుకున్న బీజేపీ.. కుంభకోణంలో కాంగ్రె స్ అధిష్టానంపై విమర్శలు చేస్తోంది. -
'అగస్టాపై చర్చకు మేం సిద్ధం'
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైంది మొదలు అధికార, ప్రతిపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. అక్రమంగా రాష్ట్రపతి పాలన విధించారంటూ కేంద్ర ప్రభుత్వంపై కత్తి దూసి సమావేశాలు అడ్డుకుంటుండగా.. దేశాన్ని ఓ కుదుపు కుదిపిన అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలని కేంద్రం వ్యూహం సిద్ధం చేసింది. అయితే, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి బుధవారం ఉదయం అగస్టాపై చర్చకు సిద్దమని స్పష్టం చేశారు. తన పార్టీ నేతలతో కలిసి సుదీర్ఘంగా చర్చించిన ఆమె ఈ అంశంపై తాము కూడా చర్చకు సిద్ధమని, నిందితులు ఎంతపెద్దవారైనా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతకుముందు లోకసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. -
గ్రీన్ గోల్ఫ్ క్లబ్
హైదరాబాద్: పచ్చదనానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంది కదూ ఈ చిత్రం. ఇది ఏ చిత్ర కారుడి కుంచె నుంచో జాలువారితే తప్ప.. ఇంత పచ్చదనం సహజసిద్ధం అంటే నమ్మడం కష్టమే కదా! అయినా.. నమ్మాల్సిందే. ఎందుకంటే ప్రపంచంలోనే ప్రఖ్యాత అగస్టా నేషనల్ గోల్ఫ్ క్లబ్ ఇది. అమెరికాలోని జార్జియాలో ఉంది. వారం క్రితం మాస్టర్స్ గోల్ఫ్ టోర్నీ ప్రారంభమైనపుడు ఇక్కడకు వచ్చిన వారు ప్రకృతి రమణీయతకు ముగ్దులైపోయారట. -
అగస్టా చెప్పే గుణపాఠం!
కుంభకోణం ముసురుకున్న అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల ఒప్పందం ఎట్టకేలకు రద్దయింది. ఈ ఒప్పందంలో రూ.362 కోట్లు చేతులు మారాయని దాదాపు రెండేళ్ల క్రితమే ఇటలీ మీడియా వెల్లడించి అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. అయినా ఒప్పందం రద్దు చేయడానికి యూపీఏ ప్రభుత్వం ఇంత సమయం తీసుకున్నది. మొదటగా స్కాం బయటపడినప్పుడు ఇక్కడ చడీ చప్పుడూ లేదు. అందుకు భిన్నంగా ఇటలీ ప్రభుత్వం వెనువెంటనే దర్యాప్తునకు ఆదేశించింది. చివరకు నిరుడు ఫిబ్రవరిలో హెలికాప్టర్ల సంస్థ ఫిన్మెకానికా సంస్థ చైర్మన్ గిసెప్పీ ఓర్సీని, ఆ సంస్థ సీఈఓ బ్రూనో స్పాగ్నోలినీని అరెస్టుచేశాక మన ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సరిగ్గా పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా జరిగిన ఈ పరిణామంతో అప్రమత్తమై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు... ఒప్పందాన్ని తాత్కాలికంగా స్తంభింపజేస్తున్నామనీ, సీబీఐ దర్యాప్తు పూర్తయిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేసింది. పార్లమెంటులో ఎంతో రభస జరిగితే తప్ప, కనీసం ఒకటి రెండు రోజులు అది వాయిదాల్లో గడిచిపోతే తప్ప స్పందించని సర్కారు తనంత తానుగానే, ఎవరూ కోరకుండానే అగస్టా స్కాంపై చురుగ్గా స్పందించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికింకా దర్యాప్తు పూర్తికాకపోయినా గత కొన్ని నెలలుగా సాగుతున్న పరిణామాలు ఒప్పందం రద్దుకు దోహదపడ్డాయి. వాస్తవానికి ఈ కేసులో సీబీఐ ఇంకా ఎలాంటి అరెస్టులూ చేయలేదు. కోర్టుకు చార్జిషీటు కూడా సమర్పించలేదు. ఈ స్కాంలో వైమానిక దళ ప్రధానాధికారి ఎస్పీ త్యాగి పాత్ర ఉన్నదని ఆరోపణలు రావడం, ఆయన సన్నిహిత బంధువులిద్దరికి దీనితో నేరుగా సంబంధం ఉన్నదని కథనాలు వెలువడటం సంచలనం కలిగించింది. రాష్ట్రపతి, ప్రధాని వంటి అత్యంత ప్రముఖులు వినియోగించడానికి ఉద్దేశించిన ఈ హెలికాప్టర్ల కొనుగోలు ప్రక్రియ ఆద్యంతమూ అనుమానాలను రేకెత్తించేదిగానే ఉంది. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరిగింది. కాగ్ నివేదిక వీటన్నిటినీ ఏకరువుపెట్టింది. రూ.793 కోట్లతో డజను హెలికాప్టర్లను కొనాలని తొలుత నిర్ణయించగా, ఒప్పంద సంప్రదింపుల కమిటీ దాన్ని రూ.4,877 కోట్లకు పెంచడాన్ని ఎత్తిచూపింది. చివరకు అగస్టా సంస్థ వాటిని తాము రూ. 3,966 కోట్లకే ఇస్తామని చెప్పడాన్ని ప్రస్తావించింది. ఒప్పందం కుదిరే సమయానికి అది రూ.3,660 కోట్లు కావడంలో నాటకీయత దాగుంది. రూ. 4,877 కోట్ల వ్యయం అనుకున్నది కాస్తా ఒక్కసారిగా రూ.1,200 కోట్లు తగ్గిపోవడంవల్ల ఎవరి అనుమానపు దృక్కులూ తమపై పడవని దళారులు భావించి ఉంటారు. ఈ ముసుగులో సరిగ్గా అగస్టాకు సరిపడేలా నిబంధనలు మార్చారు. తొలుత 19,685 అడుగుల ఎత్తు ఎగిరేలా ఉన్న నిబంధనలు కాస్తా 15,000 అడుగులకు దిగొచ్చాయి. ఇక సామర్ధ్య పరీక్షల విషయంలో కూడా అగస్టాకు ఎక్కడలేని వెసులుబాటూ ఇచ్చారు. ఒకపక్క అగస్టాతో పోటీపడ్డ అమెరికా సంస్థ సికోర్స్కీ తమ హెలికాప్టర్ల విషయంలో అవసరమైన సామర్ధ్య పరీక్షలకు సిద్ధంగా ఉన్నామని చెప్పగా అగస్టా మాత్రం తమదింకా అభివృద్ధి దశలోనే ఉన్నదంటూ నాన్చింది. చివరకు ఆ సంస్థ అప్పటికే ఉత్పత్తి చేస్తున్న మరో హెలికాప్టర్ పనితీరును చూసి అభివృద్ధి దశలో ఉన్న హెలికాప్టర్‌కు అంగీకారం తెలిపారన్నది కాగ్ అభియోగం. పైగా, ఆ హెలికాప్టర్ మన వాతావరణంలో ఎలా పనిచేస్తున్నదో చూడాలన్న ఆలోచన తట్టలేదు. వీవీఐపీల కోసం ఉద్దేశించిన హెలికాప్టర్ కొనుగోలులో కూడా ఇంత అజాగ్రత్తను ప్రదర్శించడం వింత గొలుపుతుంది. పోటీలో ఇద్దరున్నప్పుడు ఇద్దరికీ సమాన స్థాయిలో నిబంధనలు విధించి, సామర్థ్యాన్ని పరీక్షించవలసి ఉండగా ఒకరి విషయంలో ఇంతటి విశాల దృక్పథం కనబరచడం ఎన్నో అనుమానాలను రేకెత్తించి ఉండాల్సింది. రక్షణమంత్రిగా సచ్చీలుడుగా పేరున్న ఏకే ఆంటోనీ ఉండగానే ఇది ఇలా సాగిపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. రక్షణ కొనుగోళ్లలో స్కాంలు జరగడానికి వీల్లేదన్న దృఢ సంకల్పంతోనే నిజాయితీపరుడిగా పేరున్న ఆంటోనీకి ఆ పదవిని అప్పగించామని కాంగ్రెస్ పెద్దలు ఎన్నోసార్లు చెప్పారు. కానీ, ఆచరణకొచ్చేసరికి దళారుల రాజ్యమే సాగిందని అర్ధమవుతుంది. వ్యవహారాలను చక్కబెట్టడంలో ఆరితేరిన దళారులు ఆంటోనీని మాయ చేయడంలో విజయం సాధించారనుకున్నా... ఇటలీలో స్కాం సంగతి వెల్లడైన పది నెలలకుగానీ ఇక్కడ కదలిక లేదేమన్న అనుమానం తలెత్తుతుంది. ఆ సంస్థ చైర్మన్, సీఈఓలు అరెస్టయ్యేవరకూ ప్రభుత్వం చర్యలకు ఎందుకు దిగలేదని అడిగితే ఈ కాలమంతా తాము స్కాం ఆనుపానులు తెలుసుకోవడానికి ప్రయత్నించామని ఆంటోనీ చెప్పారు. సమస్త యంత్రాంగమూ అందుబాటులో ఉన్న ప్రభుత్వం అందుకు పది నెలల వ్యవధి తీసుకోవడం ఆశ్చర్యకరమే. ఇలాంటి అంశాలను సీబీఐ ఎంతవరకూ పరిగణనలోకి తీసుకున్నదో తెలియదు. ఒప్పందంలో భాగంగా ఇప్పటికే మూడు హెలికాప్టర్లు మన వైమానిక దళానికి చేరాయి. ఒప్పందాన్ని స్తంభింపజేసినట్టు మన దేశం ప్రకటించడంతో తాము మధ్యవర్తిత్వానికి వెళ్తున్నట్టు ఫిన్మెకానికా గత అక్టోబర్‌లో తెలిపింది. తదుపరి చర్యగా మన ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. ఈ చర్యవల్ల ఇటలీ సంస్థకు నష్టపరిహారం చెల్లించవలసిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అంటే దళారులు భోంచేసిన రూ.360 కోట్లకు ఇది అదనమన్నమాట. అసలు ఒప్పందాలు కుదుర్చుకోవడంలో పాటిస్తున్న గోప్యత ఇలాంటి స్కాంలకు ఆస్కారమిస్తున్నది. 2 జీ స్కాం మొదలుకొని నిన్నమొన్నటి బొగ్గు స్కాం వరకూ పారదర్శకత లేమివల్లే సమస్యలు తలెత్తుతున్నట్టు అర్ధమవుతూనే ఉంది. కానీ, యూపీఏ సర్కారు ఆ దిశగా దృష్టిపెట్టడంలేదు. అందువల్లే ప్రతిచోటా స్కాంలు ప్రత్యక్షమవుతున్నాయి.ఇకనైనా ఒప్పంద ప్రక్రియలో లొసుగులకు ఆస్కారమీయని విధానాన్ని రూపొందించాలి. అప్పుడు మాత్రమే పరిస్థితి చక్కబడుతుంది.