వైరల్ : ఈ డ్యాన్సింగ్‌ జోడీ అదిరింది | Viral Video : Puppy And Girl Dance | Sakshi
Sakshi News home page

వైరల్ : ఈ డ్యాన్సింగ్‌ జోడీ అదిరింది

Published Fri, Mar 20 2020 9:04 AM | Last Updated on Fri, Mar 20 2020 9:18 AM

Viral Video : Puppy And Girl Dance - Sakshi

డ్యాన్స్‌ చేస్తున్న పప్పీ, చిన్నారి

కరోనా కారణంగా ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా కూడా ఒకరకంగా మూగబోయింది. ప్రపంచం నలుదిక్కులా కరోనా పేరు మారుమ్రోగుతుండటంతో వైరల్‌ న్యూస్‌కు కరువొచ్చింది. దీంతో ఇంటికి పరిమితమైన వారికి ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌తో సంబంధంలేని ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్ల పెదాలపై నవ్వులు పూయిస్తోంది. ఇంతకీ సంగతేంటంటే.. మైనేకు చెందిన ఓ చిన్నారి తన కుక్కపిల్లతో కలిసి సరదాగా డ్యాన్స్‌ చేసింది. అచ్చం ఎలుగు బంటిలాగా ఉన్న ఆ కుక్కపిల్ల ఎంతో సంతోషంగా చిన్నారితో ఆడింది. పాపను విడిచిపెట్టకుండా గంతులేసింది. చిన్నారి తల్లి కారీ లేవన్‌ ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఉంచారు. ( వైరల్‌ అవుతున్న ట్రాఫిక్‌ పోలీసుల వీడియో)

మంగళవారం పోస్టైన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దాదాపు 5 మిలియన్ల వ్యూస్‌.. 3 లక్షల లైక్స్‌ సంపాదించింది. నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. ‘‘  చాలా అందంగా ఉంది! డ్యాన్స్‌ చేస్తున్నది కచ్చితంగా ఎలుగుబంటి కాదు కదా?.. అది ఏ జాతి మనిషి .. ఆ అదే కుక్క..  ఆ కుక్క ఎంతో సంతోషంగా ఉంది.  ఆ ఇద్దరూ కొన్ని వారాల ముందునుంచే ప్రాక్టీస్‌ చేశారనుకుంటా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.  ( వావ్‌.. వాటే బ్యూటీ.. ఐష్‌ జిరాక్సే )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement