న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఇప్పుడు ఆ పార్టీకి దక్కిందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. ఏపీకి సంబంధించిన పలు కీలకాంశాల్ని ప్రస్తావించారాయన.
‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇది డిమాండ్ కాదు.. ఏపీ ప్రజల హక్కు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఇప్పుడు టీడీపీకి ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్య పార్టీగా ఉంది. కాబట్టి, ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ అడగాలి. అన్యాయంగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ప్రత్యేక హోదా వల్ల నష్టాన్ని నివారించే అవకాశం ఉంది. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలి’’ అని ఆయన కోరారు.
ఇక రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులపైనా ఆయన స్పందించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు వారాలు గడిచింది. అప్పటి నుంచి ఆ పార్టీ వైఎస్సార్‌సీపీ శ్రేణులుపై దారుణంగా దాడులు చేస్తోంది. ఏపీలో శాంతి స్థాపనతో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది.
👉 పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
👉 వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపివేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు తగ్గిన గనులు కేటాయించి లాభాల్లోకి తీసుకురావాలి
👉 ఏపీలో ఐదేళ్లలో 16 మెడికల్ కాలేజీలను వైయస్ జగన్ స్థాపించారు. తక్కువ ఖర్చుతో డాక్టర్లను తయారు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. ఫ్యామిలీ డాక్టర్ పథకం ప్రవేశపెట్టి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారు.
👉 రైతులకు గిట్టుబాటు ధరలు అమలు చేయండి. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో రైతుల పంటలకు తగ్గిన భీమా సౌకర్యం కల్పించాలి
👉 రైల్వేలలో ప్రయాణికుల భద్రతకు నిధులను పెంచాలి. రైలు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వాటి నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. భద్రత చర్యలను వెంటనే అప్ గ్రెడ్ చేయాలి
👉 రైల్వే జోన్ కు ఇప్పటికే ప్రభుత్వం భూములు కేటాయించింది. నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టును పూర్తి చేయాలి
👉 విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ను వెంటనే పూర్తి చేయాలి
👉 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తి చేయాలి. విశాఖపట్నం మెట్రో రైలును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలి
ఇదీ చదవండి: అవకాశం ఉన్నా ప్రత్యేక హోదా అడగరా?: ఎంపీ తనూజ
Comments
Please login to add a commentAdd a comment