న్యూఢిల్లీ: ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జడ్ కేటగిరి భద్రతను అంగీకరించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమితాషా కోరారు. ఉత్తరప్రదేశ్‌లో ఒవైసీ కాన్వాయ్‌పై జరిగిన కాల్పుల ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. ఘటన పూర్వపరాలు, విచారణ వివరాలు సభకు వెల్లడించారు. ఎంపీ అసదుద్దీన్‌నపై హత్యా ప్రయత్నం జరిగిన నేపథ్యంలో కేంద్రం ఆయనకు జడ్ కేటగిరి భద్రతను ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. అయితే దీనిని ఒవైసీనే తిరస్కరించారని అమిత్‌షా ఈ సందర్భంగా తెలిపారు. ఒవైసీకి ఇప్పటికీ భద్రతా ముప్పు ఉందని.. జడ్ కేటగిరి భద్రతను అంగీకరించాలని పార్లమెంట్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు.
చదవండి: వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు అస్వస్థత
‘ఫిబ్రవరి 3న ఉత్తరప్రదేశ్‌లో ఒవైసీ కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ప్రమాదం నుంచి ఒవైసీ సురక్షితంగా బయట పడ్డారు. అనంతరం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి ఆల్టో కారు, పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి హోం మంత్రిత్వ శాఖ నివేదిక కోరింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కల్పించిన భద్రతకు ఒవైసీ సమ్మతించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని అమిత్ షా తెలిపారు.
చదవండి: మణికొండ జాగీర్ భూముల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
కాగా ఉత్తరప్రదేశ్‌లో ఎంపీ అసదుద్దీన్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. మీరట్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తుండగా.. గురువారం రాత్రి ఒవైసీ కారుపై దాడి జరిగింది. ఛాజర్సీ టోల్‌గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు ఆయన కారుపై కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఎంపీకి కేంద్రం జడ్ కేటగిరి భద్రత కల్పించింది. అయితే ప్రత్యేక భద్రతను ఒవైసీ తిరస్కరించారు. చావుకు తాను భయపడిపోనని, తనకు జడ్ కేటగిరి అవసరం లేదని, అందరిలాగే తాను ఏ కేటగిరి పౌరుడిగానే ఉండాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
చదవండి: టీడీపీ విషప్రచారం.. తిప్పికొట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment