
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు మరో 10 రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎంపీలకు తెలిపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కీలకమైన పలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నందునే సమావేశాలను పొడిగిస్తున్నట్లు సమాచారం. తదుపరి వివరాలను, తేదీలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం వెల్లడిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశాలు ముగిసే వరకూ ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దని పార్టీ ఎంపీలకు అమిత్‌షా సూచించినట్లు సమాచారం. కేంద్రం సీరియస్‌గా తీసుకుంటున్న ట్రిపుల్ తలాక్ బిల్లు కూడా ఆమోదించాల్సిన బిల్లుల జాబితాలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment