సాక్షి, ఢిల్లీ: రేపు(సోమవారం) నుంచి 18వ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. భర్తృహరి మెహతాజ్‌ను ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించనున్నారు. ఇక, జూన్ 26వ తేదీన లోక్‌సభ స్పీకర్ ఎన్నికల జరుగనుంది.
కాగా, ప్రొటెం స్పీకర్‌గా ఎంపికైన మెహతాజ్.. రేపు, ఎల్లుండి కొత్త ఎన్నికైన లోక్‌సభ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేపించనున్నారు. తొలిరోజు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఏపీ మంత్రులు సహా 280 మంది ఎంపీలతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. రెండో రోజు తెలంగాణ సహా మిగిలిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఇక, జూన్ 26న లోకసభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మరోవైపు.. ఏకాభిప్రాయంతో స్పీకర్ ఎన్నికకు ప్రయత్నం చేస్తోంది ఎన్డీయే ప్రభుత్వం. ఓం బిర్లాకే మళ్లీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని విపక్ష కూటమి కోరుతున్నట్టు తెలుస్తోంది.
సంప్రదాయంగా ప్రతిపక్షానికి, లేదంటే మిత్రపక్షాలకు డిప్యూటి స్పీకర్ పదవి ఇస్తారు. 2014లో అన్నాడీఎంకేకు డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీ ఇచ్చింది. 16వ లోక్‌సభలో తంబిదొరై డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. ఇక, 17వ లోక్‌సభ(2019)లో మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికీ ఇవ్వకపోవడంతో ఖాళీగానే ఉంది. ఇదిలా ఉండగా.. జూన్ 27వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment