
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు ట్విటర్ వేదికగా కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు.
ప్రజాసేవ చేస్తూనే ఉండాలి: ఓం బిర్లా
‘‘తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ప్రజా సేవ చేస్తూ, మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలుగులో ట్వీట్ చేశారు.
చదవండి: సీఎం బర్త్‌డే: అమ్మవారికి రెండున్నర కిలోల బంగారు చీర
తెలంగాణ ముఖ్యమంత్రి
— Om Birla (@ombirlakota) February 17, 2021
శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ప్రజా సేవ చేస్తూ, మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
Birthday greetings to the Chief Minister of Telangana Shri K. Chandrashekar Rao ji. May you be blessed with good health and long life. @TelanganaCMO
— Nitin Gadkari (@nitin_gadkari) February 17, 2021