
సాక్షి, తిరుమల : లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఓంబిర్లా మీడియాతో మాట్లాడారు.
‘‘తిరుమల బాలాజీ కోట్ల హిందూవుల ఆరాధ్యదైవం. కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని ఆశీస్సులు పోందడం చాలా సంతోషంగా ఉంది. దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించాను. కరోనా నుంచి ప్రజలకు త్వరలో విముక్తి కలిగించాలని స్వామి వారిని కోరుకున్నాను. స్వామి వారి ఆశీస్సులు దేశంపై మనపై ఉండాలని, దేశం మరింత అభివృద్ధి చేందాలని ప్రార్ధించాను. భక్తులకు టీటీడీ అన్ని సౌఖర్యాలు కల్పించడం సంతృప్తిగా ఆనందంగా ఉంది. స్వామి వారి కృపతో దేశానికి ఎటువంటి సేవ చేసేందుకైనా నేను సిద్దంగా ఉన్నాను’’ అని ఓంబిర్లా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment