lord venkateswaraswami
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఓంబిర్లా
సాక్షి, తిరుమల : లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఓంబిర్లా మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుమల బాలాజీ కోట్ల హిందూవుల ఆరాధ్యదైవం. కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని ఆశీస్సులు పోందడం చాలా సంతోషంగా ఉంది. దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించాను. కరోనా నుంచి ప్రజలకు త్వరలో విముక్తి కలిగించాలని స్వామి వారిని కోరుకున్నాను. స్వామి వారి ఆశీస్సులు దేశంపై మనపై ఉండాలని, దేశం మరింత అభివృద్ధి చేందాలని ప్రార్ధించాను. భక్తులకు టీటీడీ అన్ని సౌఖర్యాలు కల్పించడం సంతృప్తిగా ఆనందంగా ఉంది. స్వామి వారి కృపతో దేశానికి ఎటువంటి సేవ చేసేందుకైనా నేను సిద్దంగా ఉన్నాను’’ అని ఓంబిర్లా తెలిపారు. -
రసవత్తరంగా కుస్తీ పోటీలు
నిజాంసాగర్ : సింగితం గ్రామంలో బుధవారం మల్లయోధులకు నిర్వహించిన కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర నిర్వహించారు. రెండు రోజులుగా ఆలయం వద్ద ఎడ్ల బండ్లు, బోనాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయం ఆవరణలో మల్లయోధులకు కుస్తీపోటీలు జరిపారు. చుట్టు పక్క గ్రామాల నుంచి మల్ల యోధులు తరలిరావడంతో కుస్తీపోటీలు పోటా పోటీగా జరిగాయి. గెలుపొందిన వారికి సింగితం ఎంపీటీసీ సభ్యురాలు కలకొండ శైలజ, సర్పంచ్ ఆనందపల్లి వీరమణి, టీఆర్ఎస్ నాయకులు కలకొండ నారాయణ, సాయాగౌడ్ నగదును బహుమతులుగా అందజేశారు. కార్యక్రమంలో గున్కుల్æ సోసైటీ వైస్‌చైర్మన్ సంగారెడ్డి నాయకులు బచ్చిగారి వెంకటేశం, సాయిలు, సంగయ్య, విఠల్, శ్రీదర్‌రెడ్డి న్నారు. హన్మాజీపేట్‌లో.. బాన్సువాడటౌన్ : హన్మాజీపేట్ గ్రామంలో బుధవారం కుస్తీపోటీలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన కుస్తీవీరులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పోటీల్లో గెలుపొందిన వారికి సర్పంచ్ సంగ్రామ్ నాయక్ నగదు బహుమతులు అందజేశారు. కుస్తీపోటీలు ఆద్యాంతం ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ సాయిరాం, గ్రామపెద్దలు సుధాకర్‌రెడ్డి, బోనాల సాయిలు పాల్గొన్నారు. -
భక్తపరాధీనుడు
ఏడుకొండలవాడు, ఆశ్రిత వత్సలుడు, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మూలవిరాట్టును గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు. ఎందుకో తెలుసా? దీని వెనుక ఓ వృత్తాంతం ఉంది. స్వామి అలంకరణ కోసం పుష్పనందన వనాన్ని పెంచాలని రామానుజాచార్యులవారు తన శిష్యుడు అనంతాళ్వార్‌ను ఆదేశించారు. ఈ పనిలో అనంతాళ్వార్ సతీమణి కూడా పాలుపంచుకుంది. గర్భవతిగా ఉన్న ఆమె తవ్విన మట్టిని గంపలో తీసుకెళుతూ అలసి కింద పడిపోతుంది. దీన్ని గుర్తించిన శ్రీనివాసుడు బాలుని రూపంలో ఆమెకు సాయపడతాడు. దైవకార్యంలో ఇతరులెవరూ జోక్యం చేసుకోకూడదంటూ ఆ బాలుడిని అనంతాళ్వార్ కొడతాడు. గడ్డంపై దెబ్బ తగలడంతో బాలుడు అదృశ్యమైపోతాడు. తర్వాత అనంతాళ్వార్ ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించు కుంటాడు. గడ్డంపై నుండి రక్తం కారడం చూసిన అనంతాళ్వార్, ఆ బాలుడు శ్రీహరేనని గ్రహించి, రక్తం కారకుండా పచ్చకర్పూరం పెడతాడు. అందుకే నేటికీ మూలవిరాట్ గడ్డం కింద పచ్చకర్పూరం పెడుతున్నారు. భగవంతుడు భక్తుల కోసం పడరాని పాట్లు పడ్డాడు. పడుతుంటాడు. తన్నులు, తాపులు తిన్నాడు. భక్తి ప్రేమపాశానికి బద్ధుడై పూదోటలో బందీగా ఉన్నాడు. పప్పు రుబ్బాడు. పిండి విసిరాడు. ఎన్నో చేశాడు. భక్తులు చేయవలసిందల్లా భగవంతుణ్ని మనస్పూర్తిగా ప్రేమించడమే. -
హోదా కోసం పోరాడే శక్తినివ్వమని ప్రార్థించా
–పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సాక్షి, తిరుమల: ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే వరకు పోరాడే శక్తిని ప్రసాదించమని శ్రీవేంకటేశ్వరస్వామిని కోరుకున్నట్టు పీసీసీ అధ్యక్షుడు ర«ఘువీరారెడ్డి చెప్పారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రఘువీరా మీడియాతో మాట్లాడారు. రెండో విడత ప్రజా ఉద్యమాన్ని ప్రజాబ్యాలెట్ ద్వారా బుధవారం తిరుపతిలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, చట్టంలోని అన్ని అంశాల అమలు, గతంలో అధికార పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ప్రజాఉద్యమాన్ని రెండో దశలో ముందుకు తీసుకువెళ్లటానికి పుణ్యక్షేత్రమైన తిరుపతిని ఎంచుకున్నామన్నారు. ప్రజాభిప్రాయానికి మించిన శక్తిలేదన్నారు.