శ్రీవారి ఆలయం ప్రజాబ్యాలెట్ కరపత్రాలను చూపుతున్న రఘువీరారెడ్డి
–పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
సాక్షి, తిరుమల:
ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే వరకు పోరాడే శక్తిని ప్రసాదించమని శ్రీవేంకటేశ్వరస్వామిని కోరుకున్నట్టు పీసీసీ అధ్యక్షుడు ర«ఘువీరారెడ్డి చెప్పారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రఘువీరా మీడియాతో మాట్లాడారు. రెండో విడత ప్రజా ఉద్యమాన్ని ప్రజాబ్యాలెట్ ద్వారా బుధవారం తిరుపతిలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, చట్టంలోని అన్ని అంశాల అమలు, గతంలో అధికార పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ప్రజాఉద్యమాన్ని రెండో దశలో ముందుకు తీసుకువెళ్లటానికి పుణ్యక్షేత్రమైన తిరుపతిని ఎంచుకున్నామన్నారు. ప్రజాభిప్రాయానికి మించిన శక్తిలేదన్నారు.