
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి పార్లమెంటు వేదికగా అమరావతి అంశంపై ప్రతిపక్ష పార్టీ టీడీపీపై నిప్పులు చెరిగారు. ఈ నెల 18 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో అవినీతి రాజ్యమేలిందని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ‘నేషనల్ కౌన్సిల్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్’ ప్రకటించిందని స్పష్టం చేశారు. అలాగే రాజధానిలో అనేక కుంభకోణాలు జరిగాయని ప్రధాని నరేంద్రమోదీ సైతం చెప్పారని గుర్తు చేశారు. గల్లా జయదేవ్, చంద్రబాబు సహా అనేక మంది కుంభకోణాలకు పాల్పడ్డారని విమర్శించారు. రాజధాని అమరావతి కుంభకోణం వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.