న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. కరోనా భయంతో చాలారాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో తృణమూల్ కాంగ్రెస్‌తోపాటు చాలా పార్టీలు సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను కుదించే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం ఆర్థిక బిల్లు ఆమోదం తర్వాత సమావేశాలను ముగించే అవకాశముందన్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3 వరకు సమావేశాలు జరగాల్సి ఉండగా, సోమవారమే నిరవధిక వాయిదా పడే అవకాశముంది. దీంతో 12 రోజులు ముందుగానే సమావేశాలు ముగిసినట్లవుతుంది.(కరోనాకు మరో ముగ్గురి బలి)
Comments
Please login to add a commentAdd a comment