న్యూఢిల్లీ:తదుపరి పార్లమెంట్ సమావేశాలు ఎప్పటినుంచి నిర్వహించాలన్న దానిపై క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ‘మిషన్ కనెక్టు’ కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం పలువురు రాజ్యసభ సభ్యులతో భేటీ అయ్యారు. కరోనా నియంత్రణ కోసం అమలు చేస్తున్న చర్యలతో సత్ఫలితాలు వస్తే షెడ్యూల్ ప్రకారమే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను జూన్ 20 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు నిర్వమించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాది ఏప్రిల్ 3 వరకు జరగాల్సి ఉండగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23న ముగించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment