
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి గట్టిగా అడుగుతామని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పార్లమెంట్‌లో స్పీకర్ నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..
► పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ లేవనెత్తదలుచుకున్న అంశాలన్నింటిపై స్పీకర్‌తో చర్చించాం.
► కరోనా నియంత్రణ, లద్దాఖ్‌లో చైనా దూకుడు, కరోనా పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జీఎస్‌టీ, పన్నుల వాటా పంపిణీ, రాష్ట్రానికి సెంట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు.. వీటన్నింటిపై స్వల్పకాలిక చర్చకు అవకాశమివ్వాలని కోరాను.
► ప్రత్యేక హోదా మా హక్కు. దీన్ని అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో లేవనెత్తుతాం. ప్రతి హామీని నెరవేర్చుతున్నందునే ఏ అంశాలు లేక ప్రతిపక్షాలు మాపై నిందలు వేస్తున్నాయి.
► కరెంట్ మీటర్ల విషయంలో ఎవరూ ఆందోళనలో లేరు. ఉచిత విద్యుత్ కొనసాగుతుందని సీఎం వైఎస్ జగన్ తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment