తిరువనంతపురం: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ వాద్రా నిర్వహించిన రోడ్డు షోకు భారీగా ప్రజలు తరలిరావటంపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ విమర్శలు గుప్పించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రియాంకా గాంధీ రోడ్డు షోకు త్రిసూర్‌తో సహా ఇతర జిల్లాల ప్రజలను తరలించారని అన్నారు. అందుకే భారీగా జనాలు వచ్చారని తెలిపారు.
‘‘షూటింగ్‌కు లేదా వయనాడ్‌లోని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తామని చెప్పి ప్రజలను ప్రియాంక గాంధీ రోడ్డు షోకు తీసుకొచ్చారు. రోడ్‌షోకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావటం వెనక కారణం ఇది. ప్రియాంక గాంధీ వయనాడ్‌కు రావటం, రోడ్‌షో నిర్వహించటం ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే వచ్చే ‘సీజనల్ ఫెస్టివల్’ లాంటిది. ప్రజలు అన్నీ గమనిస్తారు.
...ప్రముఖ రాజకీయ కుటుంబ నేపథ్యం ఆధారంగా మాత్రమే ప్రియాంకా గాంధీ అభ్యర్థి అయ్యారు. కానీ, నేను కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ప్రజల కోసం ఏళ్ల తరబడి పనిచేశా. అట్టడుగు స్థాయిలో పనిచేసి ప్రజాసేవలో అనుభవం సంపాదించా. ఒక అభ్యర్థి గొప్పతనానికి కుటుంబ ఆధిపత్యమే ప్రమాణమైతే.. దానికి నిదర్శనం ప్రియాంకా గాంధీ మాత్రమే. అయితే.. బీజేపీకి అలాంటి ప్రమాణాలు ఉండవు’’ అని అన్నారు. ఇక.. నవ్య హరిదాస్ ఇవాళ బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment