
కేరళలో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. భారీ వర్షాలు, వరదలకు కొండచరియలు విరిగిపడి వయనాడ్ జిల్లాలోని పలు గ్రామాలు నేలమట్టమయ్యాయి. ఈ విపత్తులో 350 మందికి పైగా మరణించారు. వందలమంది క్షతగాత్రులయ్యారు. సర్వం కోల్పోయి శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితుల కోసం సామాన్యులు, సెలబ్రిటీలు తమవంతు సాయం చేస్తున్నారు.
హీరోయిన్ రష్మిక సైతం బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలంతా ధైర్యంగా ఉండాలంది. మరోవైపు మలయాళ స్టార్ మోహన్‌లాల్.. రూ.25 లక్షలు, కమల్ హాసన్.. రూ.25 లక్షలు, విక్రమ్.. రూ.20 లక్షలు, సూర్య, జ్యోతిక, కార్తీ కలిసి రూ.50 లక్షలు.. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ప్రకటించారు.
చదవండి: లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సహాయక చర్యల్లో మోహన్‌లాల్