
సాక్షి, ఢిల్లీ: కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పోటీ చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేయడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేశారు.
కాగా, నారాయణ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రియాంక గాంధీని వయనాడ్‌లో పోటీకి దింపడం సరికాదు. కేరళ స్థానిక నాయకులకే వయనాడ్ సీటు వదిలిపెట్టాలి. అలాగే, ఏపీలో కూల్చావేతలకు మేము పూర్తిగా వ్యతిరేకం. కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. ప్రభుత్వం చట్టపరంగానే వ్యవహరించాలి’ అని కామెంట్స్ చేశారు.
ఇక, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా వయనాడ్, రాయబరేలీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో వయనాడ్ నుంచి రాహుల్ తప్పుకోవడంతో ఉప ఎన్నికల కోసం ప్రియాంక గాంధీని బరిలో దింపారు. ఇదిలా ఉండగా.. ఇండియా కూటమిలో సీపీఐ భాగంగా ఉన్న విషయం తెలిసిందే.