ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి ఎన్నికలోనే.. ప్రియాంకా గాంధీ సత్తా చాటుతున్నారు. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక కౌంటింగ్‌లక్షకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్నారామె.
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 48 స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగడంతో.. ఫలితంపైనే యావత్ దేశం దృష్టి కేంద్రీకృతమైంది.
కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి.. ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి మూడు లక్షల ఓట్ల భారీ ఆధిక్యంలో ప్రియాంక దూసుకుపోతున్నారు. సీపీఐ నుంచి సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయి ఫలితం వెలువడే అవకాశం ఉంది.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ.. తరువాత వయనాడ్ ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రియాంక గాంధీ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. తొలిసారి ఆమె ప్రత్యక్ష ఎన్నికల పోటీలో ఉండటం విశేషం.
వయనాడ్‌లో ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ప్రియాంక గాంధీకి సీపీఐ సీనియర్ నేత సత్యన్ మొకేరి, బీజేపీ కౌన్సిలర్ నవ్య హరిదాస్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment