వయనాడ్‌ ఉప ఎన్నికకు ముగిసిన పోలింగ్‌.. ఓటింగ్‌ శాతం ఎంతంటే! | Wayanad lok sabha seat bypolls live updates | Sakshi
Sakshi News home page

వయనాడ్‌ ఉప ఎన్నికకు ముగిసిన పోలింగ్‌.. ఓటింగ్‌ శాతం ఎంతంటే!

Published Wed, Nov 13 2024 6:48 AM | Last Updated on Wed, Nov 13 2024 8:02 PM

Wayanad lok sabha seat bypolls live updates

  • Updates
     
  • వాయనాడ్‌లో సాయంత్రం 6 గంటల వరకు 64.27% ఓటింగ్ నమోదైంది.
  •  వాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. వాయనాడ్ నియోజకవర్గంలో 64.27% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గడిచిన ఎన్నికల్లో ఇది 72.92 శాతంగా ఉంది.
  • కలపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 65.01%, సుల్తాన్ బతేరిలో 62.10%, మనంతవాడిలో 63.48%, తిరువంబాడిలో 66.05%, ఎర్నాడులో 68.97%, నిలంబూరులో 61.46%, వండూరులో 64.01% పోలింగ్ నమోదైంది.

 

  • వయనాడ్‌లో పార్లమెంట్‌ స్థానం ఉప ఎన్నిక పోలింగ్‌  కొనసాగుతోంది.
  • వాయనాడ్ ఉప ఎన్నిక: మధ్యాహ్నం 1 గంటల వరకు 40% పైగా ఓటింగ్ నమోదైంది
  • వాయనాడ్‌లో మధ్యాహ్నం 12.30 గంటల వరకు 34.38 శాతం పోలింగ్‌ నమోదైంది

     ఉదయం 11 గంటల వరకు వయనాడ్‌లో 27.04 శాతం పోలింగ్‌ నమోదైంది.

     

 

 

కేరళ: 

  • వయనాడ్‌ పార్లమెంట్‌ స్థానం ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది.
  • ఉదయం 9 గంటల వరకు వాయనాడ్‌లో 13.04 శాతం ఓటింగ్ నమోదైంది.

 

కర్ణాటక:

  • బీజేపీ నేత, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై షిగ్గావ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు
  • షిగ్గావ్  అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది.
  • బొమ్మై కుమారుడు భరత్ బొమ్మై షిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు

 

కేరళ:

  • వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. 
  • కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా మీడియాతో మాట్లాడారు.
  • వయనాడ్ ప్రజలు చూపిన ప్రేమను తిరిగి చెల్లించడానికి, వారి కోసం పని చేయడానికి తమ ప్రతినిధిగా ఉండటానికి నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా. 
  • ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని ఓటు వేస్తారని ఆశిస్తున్నా

 

 

 

రాజస్థాన్: 

  • దౌసా అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. 
  • కాంగ్రెస్ ఎంపీ మురారీ లాల్ మీనా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • దౌసా అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి దీనదయాళ్ బైర్వా, బీజేపీ నుంచి జగ్‌మోహన్ మీనాను బరిలోకి దిగారు.

 

 

కేరళ

  • వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల  పోలింగ్‌ కొనసాగుతోంది. 
  • బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మీడియాతో మాట్లాడారు.
  • వయనాడ్ ప్రజలకు అట్టడుగు స్థాయిలో పని చేయగల, పార్లమెంటులో తమ సమస్యలను పరిష్కరించగల నేత కావాలి. 
  • కిట్‌లు, డబ్బు, మద్యం, అన్నీ అందించి ఈసారి ఓటర్లను ప్రభావితం చేయడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది.
  • ఈ ఎన్నికల్లో తాము ఓడిపోతామన్న భయం కాంగ్రెస్‌కు ఉంది

 

 

మధ్యప్రదేశ్‌:

  • బుద్ని ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది.
  • సెహోర్‌లోని పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికే చౌహాన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
     

      

కర్ణాటక:

  • చన్నపట్న అసెంబ్లీ ఉపఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది.
  • ఓటు వేయడానికి కర్ణాటకలోని చన్నపట్నాలోని పోలింగ్ స్టేషన్ వద్ద ప్రజలు క్యూ కట్టారు.
  • ఎన్డీయే తరఫున ఈ స్థానం నుంచి జేడీఎస్‌ పార్టీ నేత నిఖిల్ కుమారస్వామి, కాంగ్రెస్‌ తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీపీ యోగేశ్వర్‌ పోటీలో ఉన్నారు.

 

 

 

కేరళ

  • పాలక్కాడ్ అసెంబ్లీ  ఉపఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది.
  • ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు.

 

పశ్చిమ బెంగాల్‌: 

  • పశ్చిమ్‌ మేదినీపూర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది.  
  • శ్రీతికోన అరబింద హైస్కూల్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్‌లో ఉన్నారు.

 

కేరళ:

  • వయనాడ్‌ లోక్‌సభ  ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
  • పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారు.

 

ఛత్తీస్‌గఢ్:

  • రాయ్‌పూర్ సిటీ సౌత్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
  • ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు తరలి వస్తున్నారు.
  • బీజేపీ మాజీ ఎంపీ, మేయర్‌ సునీల్‌కుమార్‌ సోనీని, కాంగ్రెస్‌ తరఫున యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆకాశ్‌ శర్మను పోటీలో ఉన్నారు.
     

 

 

అస్సాం:

  • సమగురి అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.
  • ఓటు వేయడానికి ప్రజలు నాగాన్‌లోని పోలింగ్ స్టేషన్ వద్ద క్యూ కట్టారు.

 

 

కేరళ

  • వాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలకు ఓటు వేయడానికి ప్రజలు వాయనాడ్‌లోని పోలింగ్ స్టేషన్ వద్ద క్యూ కట్టారు.


     

మధ్యప్రదేశ్: 

  • షియోపూర్ జిల్లాలోని బుద్ని అసెంబ్లీలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది.
  • పోలింగ్ స్టేషన్ నంబర్ 170 ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల కొత్త భవనం (విజయపూర్) వద్ద పోలింగ్‌ ప్రారంభమైంది.

 

 

  • కేరళలో వయనాడ్‌ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.

 

 

  • రెండుచోట్ల పోటీచేసి గెలిచిన రాహుల్‌గాంధీ వయనాడ్‌లో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
  • కాంగ్రెస్‌ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.
  • ఆమెపై ఎల్‌డీఎఫ్‌ నుంచి సథ్యాన్‌ మోకేరీ, బీజేపీ తరఫున నవ్య హరిదాస్‌ నిలబడ్డారు
  • ఇక్కడ 14 లక్షల మంది ఓటర్ల  ఉన్నారు. 
  • కాంగ్రెస్‌ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్‌లతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
  • వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉననా మనంతవాడి (ST), సుల్తాన్ బతేరి (ST), వయనాడ్ జిల్లాలోని కల్పెట్ట, కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి, మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలంబూర్, వండూర్. 
     
  • ఈ రోజు(బుధవారం) 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి.
  • ఇక 31 ఎమ్మెల్యే స్థానాల్లో రాజస్తాన్‌లో 7, పశ్చిమబెంగాల్‌లో 6, అస్సాంలో 5, బిహార్‌లో 4, కర్నాటకలో 3 మధ్యప్రదేశ్‌లో 2, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మేఘాలయాల్లో ఒక్కో స్థానం ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement