మహిళా ప్రయాణికుల కోసం మహిళా డ్రైవర్లతో 50 ఆటో సేవలు థానేలో త ్వరలో ప్రారంభం కానున్నాయి
సాక్షి, ముంబై : మహిళా ప్రయాణికుల కోసం మహిళా డ్రైవర్లతో 50 ఆటో సేవలు థానేలో త ్వరలో ప్రారంభం కానున్నాయి. పట్టణంలో కొన్ని ఆటోలు మహిళలే నడపాలని ఎమ్మెమ్మార్డీఏకు ప్రతిపాదన పంపిన రవాణా శాఖ, తర్వాత మహిళల సంక్షేమం కోసం 50 మంది మహిళా డ్రైవర్లను ఇవ్వాలని ఎన్జీవోలను ఆశ్రయించింది. మహిళలకు ప్రత్యేక పర్మిట్లు జారీ చేసి వారితో ఆటోలను నడిపించేందుకు కృషి చేస్తున్నామని రవాణా విభాగం పేర్కొంది.
మహిళలే ఆటో నడపడం వల్ల మహిళా ప్రయాణికులకు కూడా సురక్షిత భావం ఏర్పడుతుందని రవాణా శాఖ అధికారి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆటోలకు ప్రత్యేక రంగు ప్రతిపాదించామని తెలిపారు. ఈ ప్రతిపాదన అమలైతే రాష్ట్రంలో మహిళా డ్రైవర్లున్న తొలి పట్టణంగా థానేకు ఘనత దక్కుతుందని అన్నారు.