న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్–2024 మార్చి) ఆగస్టు 10వ తేదీ వరకూ గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 17 శాతం పెరిగి రూ.5.84 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో ఇది 32 శాతానికి సమానం.
ఆదాయపు పన్ను శాఖ ప్రకటన ప్రకారం, స్థూల వసూళ్లు 15.73 శాతం పురోగతితో రూ.6.53 లక్షల కోట్లుగా ఉన్నాయి. వీటిలో రిఫండ్స్ రూ.69,000 కోట్లు. ఒక్క రిఫండ్స్ గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 3.73 శాతం అధికం. 2023–24లో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యం రూ.18.23 లక్షల కోట్లు. 2022–23తో పోల్చితే (రూ.16.61 లక్షల కోట్లు) ఈ పరిమాణం 9.75 శాతం అధికం.
Comments
Please login to add a commentAdd a comment