Net direct tax collections
-
ప్రభుత్వానికి కాసుల గలగల.. భారీగా పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: అధిక ముందస్తు పన్ను చెల్లింపుల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 17వ తేదీ వరకూ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16.12 శాతం పెరిగి రూ.9,95,766 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్స్ విలువ గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 56.49% ఎగసి రూ.2.05 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వెరసి స్థూలంగా వసూళ్లు రూ. 12.01 లక్షల కోట్లుగా నమోదయ్యాయని గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇవి 21.48% అధికం. విభాగాల వారీగా చూస్తే.. » నికర వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు 19 శాతం పెరిగి రూ. 5.15 లక్షల కోట్లకు చేరాయి. » కార్పొరేట్ పన్ను వసూళ్లు 10.55 శాతం పెరిగి రూ. 4.52 లక్షల కోట్లకు చేరాయి. » సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్టీటీ) ఆదాయం రూ.26,154 కోట్లు. » ఒక్క అడ్వాన్స్ ట్యాక్స్ చూస్తే 22.61 శాతం పెరిగి రూ.4.36 లక్షల కోట్లుగా ఉన్నాయి. వ్యక్తిగత పన్నుల విషయంలో ఈ మొత్తాలు 39.22 శాతం పెరిగితే, కార్పొరేట్ పన్నుల విషయంలో ఈ పెరుగుదల 18.17 శాతంగా ఉంది. » ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 13 శాతం పెరిగి రూ.22.12 లక్షల కోట్లకు చేరాలన్నది బడ్జెట్ లక్ష్యం. -
కాసుల పంట.. భారీగా పన్ను వసూళ్లు
దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై 11 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు 19.54 శాతం వృద్ధి చెంది రూ. 5.74 లక్షల కోట్లకు చేరాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఈ పన్ను వసూళ్లు రూ.4.80 లక్షల కోట్లుగా ఉన్నాయని పేర్కొంది.నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 5.74 లక్షల కోట్లలో (జూలై 11 నాటికి) కార్పొరేషన్ పన్ను (CIT) రూ. 2.1 లక్షల కోట్లు (రీఫండ్ మినహాయింపు తర్వాత), వ్యక్తిగత ఆదాయపు పన్ను (PIT) రూ. 3.46 లక్షల కోట్లు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) రూ. 16,634 కోట్లు (రీఫండ్ మినహాయింపు తర్వాత) ఉన్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) వివరించింది.కాగా ప్రభుత్వం 2024-25లో జూలై 11 వరకు రూ. 70,902 కోట్ల ప్రత్యక్ష పన్ను రీఫండ్లను జారీ చేసింది. 2023-24లో జారీ చేసిన రూ. 43,105 కోట్లతో పోలిస్తే ఇది 64.49 శాతం పెరిగింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లకు సంబంధించి ప్రభుత్వం సవరించిన అంచనాల్లో పూర్తి ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్-మార్చి) రూ. 21.99 లక్షల కోట్ల వసూళ్లను అంచనా వేసింది.ఒక నిర్దిష్ట సంవత్సరానికి ప్రభుత్వం తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడుతుంది కాబట్టి ఆరోగ్యకరమైన పన్ను వసూళ్లు ముఖ్యమైనవి . కేంద్రం మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక లోటు 5.2 శాతం లక్ష్యంగా పెట్టుకుంది. స్థూల ప్రాతిపదికన, రీఫండ్లను సర్దుబాటు చేయడానికి ముందు, ప్రత్యక్ష పన్ను వసూళ్లు జూలై 11 నాటికి రూ. 6.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 23.24 శాతం వృద్ధి. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13.70 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు డిసెంబర్ 17వ తేదీ నాటికి గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 21 శాతం పెరిగి రూ.13,70,388 కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో కార్పొరేట్ పన్ను (సీఐటీ) వాటా రూ.6.95 లక్షల కోట్లు. వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ), సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) వాటా రూ.6.73 లక్షల కోట్లు. ఆదాయపు పన్ను శాఖ తెలిపిన సమాచారం ప్రకారం, 2023–24 బడ్జెట్ లక్ష్యాల్లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 75 శాతానికి చేరాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.16.63 లక్షల కోట్లు. 2023–24లో ఈ లక్ష్యాన్ని రూ.18.23 లక్షల కోట్లుగా బడ్జెట్ నిర్దేశించుకుంది. రిఫండ్స్ రూ.2.25 లక్షల కోట్లు.. కాగా, డిసెంబర్ 17 వరకూ రిఫండ్స్ విలువ రూ.2.25 లక్షల కోట్లు. వీటిని కూడా కలుపుకుంటే స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.15.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.7.90 లక్షల కోట్లు, ఎస్‌టీటీసహా వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.8.03 లక్షల కోట్లు. వేర్వేరుగా వసూళ్లను పరిశీలిస్తే... అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు రూ.6.25 లక్షల కోట్లు, టీడీఎస్ రూ.7.71 లక్షల కోట్లు, సెల్ప్–అసెస్మెంట్ ట్యాక్స్ రూ.1.49 లక్షల కోట్లు. రెగ్యులర్ అసెస్మెంట్ ట్యాక్స్ రూ. 36,651 కోట్లు. ఇతర హెడ్స్ కింద వసూళ్ల మ్తొతం రూ.14,455 కోట్లు. లక్ష్యాల సాధనపై భరోసా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం రూ.18.23 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది. పరోక్ష పన్నుల (వస్తు సేవల పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్) వసూళ్ల లక్ష్యం రూ.15.38 లక్షల కోట్లు. వెరసి మొత్తం పన్ను వసూళ్ల లక్ష్యం రూ. 33.61 లక్షల కోట్లు. ఈ స్థాయి పన్ను వసూళ్ల లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, డిసెంబర్ 17 వరకూ ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 21 శాతం పెరిగాయి. పరోక్ష పన్ను దాదాపు 5 శాతం అధికంగా నమోదయ్యాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల మొత్తం రూ.30.54 లక్షల కోట్లు. 2023–24లో దీనిని 10 శాతం (రూ.33.61 లక్షల కోట్లు) పెంచాలన్న లక్ష్యాన్ని బడ్జెట్ నిర్దేశించుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో ఓట్ ఆన్ అకౌంట్ లేదా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. లోక్‌సభకు ఎన్నికల అనంతరం కొలువుదీరే నూతన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. -
డబ్బులే డబ్బులు! భారీగా పన్ను వసూళ్లు.. ఈసారి ఏకంగా..
న్యూఢిల్లీ: భారత్ ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు అక్టోబరు 9 నాటికి 21.82 శాతం పెరిగి రూ.9.57 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కార్పొరేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ వసూళ్లు నమోదయినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్ల బడ్జెట్ లక్ష్యం రూ.18.23 లక్షల కోట్లు. 2022–23 ఆర్థిక సంవత్సరం వసూళ్లతో (రూ.16.61 లక్షల కోట్లు) పోల్చితే ఇది 9.75 శాతం అధికం. కాగా, తాజా గణాంకాల ప్రకారం, అక్టోబర్ 9 నాటికి నికర వసూళ్లు బడ్జెట్ లక్ష్యంలో 52.5 శాతానికి చేరాయి. అయితే ప్రస్తుతం విడుదల చేస్తున్నవి తొలి తాత్కాలిక గణాంకాలనీ, తుది గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికశాఖ పేర్కొంది. కొన్ని ముఖ్యాంశాలు ఇలా.. స్థూల వసూళ్లు అక్టోబర్ 9 నాటికి రూ.11.07 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ పరిమాణం 17.95 శాతం అధికం. కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ) వసూళ్లలో 7.30 శాతం వృద్ధి, వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) 29.53 శాతం వృద్ధి నమోదయ్యాయి (ఎస్టీటీ సహా) అక్టోబర్ 9 వరకూ రిఫండ్స్ విలువ రూ.1.50 లక్షల కోట్లు. -
ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు 17 శాతం అప్
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్–2024 మార్చి) ఆగస్టు 10వ తేదీ వరకూ గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 17 శాతం పెరిగి రూ.5.84 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో ఇది 32 శాతానికి సమానం. ఆదాయపు పన్ను శాఖ ప్రకటన ప్రకారం, స్థూల వసూళ్లు 15.73 శాతం పురోగతితో రూ.6.53 లక్షల కోట్లుగా ఉన్నాయి. వీటిలో రిఫండ్స్ రూ.69,000 కోట్లు. ఒక్క రిఫండ్స్ గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 3.73 శాతం అధికం. 2023–24లో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యం రూ.18.23 లక్షల కోట్లు. 2022–23తో పోల్చితే (రూ.16.61 లక్షల కోట్లు) ఈ పరిమాణం 9.75 శాతం అధికం. -
అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత్ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 18 శాతం పెరిగి, రూ.16.61 లక్షల కోట్లకు ఎగశాయి. ఆర్థిక శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) 2021–22లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.12 లక్షల కోట్లు. రిఫండ్స్‌ను సర్దుబాటు చేయకుండా స్థూలంగా చూస్తే, పన్ను వసూళ్లు రూ.19.68 లక్షల కోట్లని ఆర్థికశాఖ వివరించింది. వీటిలో నుంచి మార్చి 31 వరకూ రూ.3.07 లక్షల కోట్ల రిఫండ్స్ జరిగాయి. (అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..) -
పన్ను వసూళ్లు రూ.13..73 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13.73 లక్షల కోట్లకు చేరాయి. ఇది పూర్తి ఆర్థిక సంవత్సరానికి సవరించిన లక్ష్యంలో 83.19 శాతానికి సమానమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) శనివారం వెల్లడించింది. అలాగే అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16.78 శాతం అధికంగా నమోదు కావడం విశేషం. సీబీడీటీ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 10 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 22.58 శాతం అధికమై రూ.16.68 లక్షల కోట్లకు ఎగశాయి. ఇందులో రిఫండ్స్ వాటా రూ.2.95 లక్షల కోట్లుగా ఉంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రిఫండ్స్ 59.44 శాతం ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వసూలైన నికర ప్రత్యక్ష పన్నులు మొత్తం బడ్జెట్ అంచనాల్లో 96.67 శాతానికి సమానం. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లే వృద్ధిని నడిపించాయని సీబీడీటీ తెలిపింది. రిఫండ్స్ పోను నికరంగా కార్పొరేట్ ఇన్‌కం ట్యాక్స్ వసూళ్లు 13.62%, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌తో కలిపి పర్సనల్ ఇన్‌కం ట్యాక్స్ వసూళ్లు 20.06% వృద్ధి చెందాయి. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 45 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) జూన్ 16వ తేదీ నాటికి 45 శాతం పెరిగాయి. విలువలో రూ.3.39 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022–23 ఇదే కాలంలో ఈ వసూళ్ల పరిమాణం రూ.2,33,651 కోట్లు. భారీగా నమోదయిన ముందస్తు పన్ను వసూళ్లు ఈ స్థాయి పురోగతికి కారణమని ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం వసూళ్లలో కార్పొరేట్ పన్ను (సీఐటీ) విభాగానికి సంబంధించి రూ.1.70 లక్షల కోట్లకుపైగా మొత్తం నమోదయ్యింది. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ)సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) విభాగంలో రూ.1.67 లక్షల కోట్లకుపైగా వసూళ్లు జరిగాయని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. వసూళ్లలో ముందస్తు పన్ను వాటా 33 శాతంపైగా పెరిగి రూ.1.01 లక్షల కోట్లకు ఎగసింది. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. సూపర్
న్యూఢిల్లీ: దేశంలో ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఈ పరిమాణం ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి (2021 ఏప్రిల్) నవంబర్ 23 నాటికి 2020–21 ఇదే కాలంతో పోల్చిచూస్తే, 68 శాతం పెరిగి రూ.6.92 లక్షల కోట్లకు ఎగశాయి. ఆర్థిక శాఖ సహాయమంతి పంకజ్ చతుర్వేది లోక్‌సభ లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. ఆయన తెలిపిన సమాచారాన్ని పరిశీలిస్తే.. ► 2021–22 నవంబర్ 23 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6,92,834 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ మొత్తం 68 శాతం అధికమైతే, కోవిడ్ ముందస్తు కాలం 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే మాత్రం 27.29 శాతం అధికం. 2020–21 ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 23 మధ్య నికర వసూళ్లు రూ.4.12 లక్షల కోట్లయితే, 2019–20 మధ్య ఈ మొత్తం రూ.5.44 లక్షల కోట్లు. ► 2021 నవంబర్ 23వ తేదీ వరకూ చూస్తే, రిఫండ్స్ జరక్క ముందు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.8.15 లక్షల కోట్లు. 2021 ఇదే కాలంలో పోల్చితే స్థూల వసూళ్ల వృద్ధి 48.11 శాతం. ► ఇక పరోక్ష పన్నుల విషయానికి వస్తే వస్తు సేవల పన్నులో (జీఎస్టీ) గణనీయమై వృద్ధి ధోరణి కనబడుతోంది. 2020–21 జీఎస్టీ వసూళ్లు రూ.11.36 లక్షల కోట్లు. 2021–22 అక్టోబర్ వరకూ ఈ వసూళ్లు రూ.8.10 లక్షల కోట్లు. ► పన్ను ఎగవేతలను నిరోధించడానికి కేందం తీసుకుంటున్న చర్యలు ఫలితమిస్తున్నాయి. జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడానికి ఇదీ ఒక కారణం. ► 2021–22 బడ్జెట్లో పన్నుల ఆదాయం రూ.22.2 లక్షల కోట్లుగా కేంద్రం అంచనాలు వేసింది. ఇందులో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.11 లక్షల కోట్లు. ఇందులో కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో రూ.5.47 లక్షల కోట్లుగా రావచ్చని అంచనా. 2020–21లో పన్నుల ఆదాయం రూ.20.2 లక్షల కోట్లు. -
14 శాతం పెరిగిన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ, ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 20 వరకూ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 13.7 శాతం వృద్ధితో రూ. 4.12 లక్షల కోట్లకు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఈ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ. 3.63 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరిగాయి. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 6.68 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్ల(రూ.5.65 లక్షల కోట్లు)తో పోల్చితే ఇది 19 శాతం అధికం.