![Net direct tax collections surge - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/11/tax-collections.jpg.webp?itok=ktH8TIyI)
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: భారత్ ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు అక్టోబరు 9 నాటికి 21.82 శాతం పెరిగి రూ.9.57 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కార్పొరేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ వసూళ్లు నమోదయినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది.
మరిన్ని వివరాల్లోకి వెళితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్ల బడ్జెట్ లక్ష్యం రూ.18.23 లక్షల కోట్లు. 2022–23 ఆర్థిక సంవత్సరం వసూళ్లతో (రూ.16.61 లక్షల కోట్లు) పోల్చితే ఇది 9.75 శాతం అధికం. కాగా, తాజా గణాంకాల ప్రకారం, అక్టోబర్ 9 నాటికి నికర వసూళ్లు బడ్జెట్ లక్ష్యంలో 52.5 శాతానికి చేరాయి. అయితే ప్రస్తుతం విడుదల చేస్తున్నవి తొలి తాత్కాలిక గణాంకాలనీ, తుది గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికశాఖ పేర్కొంది.
కొన్ని ముఖ్యాంశాలు ఇలా.. స్థూల వసూళ్లు అక్టోబర్ 9 నాటికి రూ.11.07 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ పరిమాణం 17.95 శాతం అధికం. కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ) వసూళ్లలో 7.30 శాతం వృద్ధి, వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) 29.53 శాతం వృద్ధి నమోదయ్యాయి (ఎస్‌టీటీ సహా) అక్టోబర్ 9 వరకూ రిఫండ్స్ విలువ రూ.1.50 లక్షల కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment