tax collections
-
లక్ష్యాన్ని మించేలా పన్ను వసూళ్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు.. నిర్దేశిత రూ.22.07 లక్షల కోట్ల లక్ష్యాన్ని దాటేస్తాయని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. కార్పొరేట్, నాన్–కార్పొరేట్ పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)లో ట్యాక్స్‌పేయర్స్ లాంజ్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. సీబీడీటీ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 మధ్య కాలంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా 15.41 శాతం పెరిగి రూ.12.11 లక్షల కోట్లకు చేరాయి.ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్‌లు కళకళమరోవైపు, 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను విదేశీ ఆదాయం, అసెట్స్‌ను తమ ఐటీఆర్‌లలో వెల్లడించని వారు సవరించిన రిటర్న్‌లను దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువుందని అగర్వాల్ పేర్కొన్నారు. ఇతర దేశాలతో ఒప్పందాల ద్వారా విదేశీ అసెట్స్ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అందుతాయని, ఐటీఆర్‌లలో పొందుపర్చిన వివరాలతో వాటిని సరిపోల్చి చూస్తుందని తెలిపారు. అధిక విలువ అసెట్స్‌ను వెల్లడించనివారికి ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పంపే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఆదాయ పన్ను చట్టంలో భాషను సరళంగా, అందరికీ అర్థమయ్యే విధంగా మార్చడంపై 6,000 పైచిలుకు సలహాలు తమకు వచ్చినట్లు అగర్వాల్ పేర్కొన్నారు. -
రాష్ట్రాలకు రూ.72,961 కోట్లు విడుదల.. ఎందుకంటే..
కేంద్రప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాల వాటాను ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తూ ఉంటుంది. అయితే రానున్న నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల అవసరాలు తీర్చేలా రూ.72,961.21 కోట్ల పన్నుల పంపిణీకి కేంద్రం శుక్రవారం ఆమోదం తెలిపింది. వివిధ సామాజిక సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వాలను బలోపేతం చేయడానికి ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబరు 11, 2023న ఇప్పటికే విడుదలైన నిధులకు తాజాగా విడుదల చేస్తున్న రూ.72,961.21 కోట్లు అదనం అని కేంద్రం ప్రకటనలో చెప్పింది. ఈ నిధుల్లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు అత్యధికంగా రూ.13,088.51 కోట్లు, బిహార్ రూ.7338.44 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.5727.44 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.5488.88 కోట్లు రానున్నాయి. ఇదీ చదవండి: 2024లో బ్యాంక్ సెలవులు ఇవే.. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో 41 శాతం నిధులను 14 విడతలుగా రాష్ట్రాలకు పంపిణీ చేసినట్లు సమాచారం. 2023-24 బడ్జెట్ ప్రకారం ఈ ఏడాది రాష్ట్రాలకు రూ.10.21 లక్షల కోట్లు బదిలీ చేయాలని కేంద్రం భావిస్తోంది. -
డబ్బులే డబ్బులు! భారీగా పన్ను వసూళ్లు.. ఈసారి ఏకంగా..
న్యూఢిల్లీ: భారత్ ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు అక్టోబరు 9 నాటికి 21.82 శాతం పెరిగి రూ.9.57 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కార్పొరేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ వసూళ్లు నమోదయినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్ల బడ్జెట్ లక్ష్యం రూ.18.23 లక్షల కోట్లు. 2022–23 ఆర్థిక సంవత్సరం వసూళ్లతో (రూ.16.61 లక్షల కోట్లు) పోల్చితే ఇది 9.75 శాతం అధికం. కాగా, తాజా గణాంకాల ప్రకారం, అక్టోబర్ 9 నాటికి నికర వసూళ్లు బడ్జెట్ లక్ష్యంలో 52.5 శాతానికి చేరాయి. అయితే ప్రస్తుతం విడుదల చేస్తున్నవి తొలి తాత్కాలిక గణాంకాలనీ, తుది గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికశాఖ పేర్కొంది. కొన్ని ముఖ్యాంశాలు ఇలా.. స్థూల వసూళ్లు అక్టోబర్ 9 నాటికి రూ.11.07 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ పరిమాణం 17.95 శాతం అధికం. కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ) వసూళ్లలో 7.30 శాతం వృద్ధి, వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) 29.53 శాతం వృద్ధి నమోదయ్యాయి (ఎస్టీటీ సహా) అక్టోబర్ 9 వరకూ రిఫండ్స్ విలువ రూ.1.50 లక్షల కోట్లు. -
కాసుల గలగల.. భారీగా పెరిగిన పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 17 నాటికి నికరంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 11.18 శాతం పెరిగి రూ. 3.80 లక్షల కోట్లకు చేరాయి. అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు పెరగడం ఇందుకు దోహదపడినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. జూన్ 17 నాటికి ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 13.70%పెరిగి రూ. 1,16,776 కోట్లకు చేరాయి. నికరంగా వసూలైన రూ. 3,79,760 కోట్ల ప్రత్యక్ష పన్నుల్లో కార్పొరేషన్ పన్నులు రూ. 1,56,949 కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్నులు రూ. 2,22,196 కోట్లు ఉన్నాయి. జూన్ 17 నాటికి రీఫండ్లు 30% పెరిగి రూ. 39,578 కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్టీ రిటర్నులకు అదనపు ధ్రువీకరణలు! కాగా పన్ను ఎగవేతలు, నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్‌లకు అడ్డుకట్ట వేసేలా జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్ విధానంలో మరిన్ని ధ్రువీకరణలను అమలు చేయాలన్న సీబీఐసీ ప్రతిపాదనను జూలై 11న జరిగే సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు ఈ విషయం తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలోనూ అలాగే రిటర్ను దాఖలు చేసేటప్పుడు కూడా అదనంగా ధ్రువీకరణ నిబంధనలను ప్రవేశపెట్టాలని కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు నిర్ణయించినట్లు వివరించారు. -
Kurnool District: గ్రామీణ ప్రాంతాల్లో మందగించిన పన్ను వసూళ్లు
కర్నూలు(అర్బన్): గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక వనరులను సమీకరించుకోవడం, పన్ను వసూళ్లు, ప్రభుత్వం విడుదల చేసే గ్రాంట్లకు సంబంధించిన నిధుల పరిపుష్టితోనే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుత పాలకవర్గాలు ఆ దిశగా అడుగులు వేయకుండా, కేవలం ప్రభుత్వం విడుదల చేసే గ్రాంట్లపైనే ఆధారపడుతుండటంతో అభివృద్ధి నిదానించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులకు తోడుగా.. గ్రామ పంచాయతీల్లో పన్నులు, పన్నేతరములపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తే ఆయా గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశాలు ఉంటాయి. గ్రామ పంచాయతీల్లో వసూలు చేయాల్సిన పన్నులు, పన్నేతరములకు సంబంధించి పంచాయతీరాజ్ కమిషనర్ ప్రతి వారం సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండున్నర నెలలు మాత్రమే ఉండడంతో పన్నుల వసూలు వేగం పుంజుకుంది. సర్పంచుల పాత్ర కీలకం గ్రామ పంచాయతీ పరిధిలో పన్ను వసూలు చేయడం, వాటిని అభివృద్ధి పనులకు వెచ్చించుకునే విషయంలో గ్రామ సర్పంచులది కీలకపాత్ర. ఆయా గ్రామ పంచాయతీల్లో పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని పూర్తిగా గ్రామాభివృద్ధి కోసం వెచ్చించుకునే సౌలభ్యం ఉంది. అయినా వివిధ గ్రామాల సర్పంచులు పన్ను వసూళ్లపై పెద్దగా దృష్టి సారించనట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం, ఇతర గ్రాంట్ల పైనే గ్రామ పంచాయతీ పాలకవర్గాలు దృష్టి కేంద్రీకరించాయే తప్ప స్థానిక వనరుల నుంచి పంచాయతీలకు వచ్చే ఆదాయాలను పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో పన్నులు(ఇంటి పన్ను, లైబ్రరీ సెస్సు, కుళాయి పన్ను ), పన్నేతరముల (మార్కెట్ వేలాలు, షాపింగ్ అద్దెలు, లైసెన్స్ ఫీజులు, కుళాయి ఫీజులు, భవన నిర్మాణ ఫీజులు) రూపంలో సొంత వనరులను సమీకరించుకోవడంలో సర్పంచులు తమ పాత్రను పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పల్లె ఆదాయాన్ని పెంచేందుకు సమష్టి కృషి గ్రామ పంచాయతీలకు ఆదాయాన్ని పెంచుకునే అంశంలో క్షేత్ర స్థాయి అధికారులు సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనేక గ్రామ పంచాయతీల్లో దశాబ్దం క్రితం ఉన్న ఇళ్ల సంఖ్యనే నేటికీ లెక్కల్లో చూపుతున్నారు. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో దాదాపు 50 శాతం గ్రామ పంచాయతీలు భౌగోళికంగా విస్తరించాయి. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామ పంచాయతీల్లో కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. అయితే కొత్తగా గ్రామ శివారుల్లో ఏర్పాటవుతున్న కాలనీలు, కొత్త ఇళ్లపై సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడం వల్ల ఆయా గ్రామ పంచాయతీలు ప్రత్యక్షంగా పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నట్లు తెలుస్తోంది. డివిజన్ల వారీగా లక్ష్యాలు పన్నుల వసూళ్లకు సంబంధించి డివిజన్ల వారీగా లక్ష్యాలను నిర్ణయించాం. ఒక్కో డివిజన్ వారానికి రూ.కోటి వసూలు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశాం. అలాగే ముగ్గురు డీఎల్పీఓలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాం. వసూళ్లకు సంబంధించి ప్రతి రోజు జిల్లా కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు పర్యవేక్షిస్తారు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచుకునే దిశగా చర్యలు చేపట్టాలని క్షేత్ర స్థాయిలోని ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులను కోరుతున్నాం. – టి.నాగరాజునాయుడు, జిల్లా పంచాయతీ అధికారి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు గ్రామాల్లో పన్నులు చెల్లించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తాము విధులు నిర్వహిస్తున్న గ్రామాల్లో ప్రజలే స్వచ్ఛందంగా పంచాయతీ కార్యాలయానికి వచ్చి చెల్లిస్తున్నారు. అలాగే డివిజన్, జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల మేరకు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాం. గ్రామ పంచాయతీకి పన్నులు చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నిర్ణీత లక్ష్యాలను పూర్తి చేస్తాం. – గురుస్వామి, అధ్యక్షులు, జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం -
బడ్జెట్ అంచనాలను మించి పన్ను వసూళ్లు!
న్యూఢిల్లీ: భారత్ పన్ను వసూళ్లు 2023 మార్చితో ముగిసే 2022–23 ఆర్థిక సంవత్సరంలో అంచనాలను మించి నమోదుకానున్నట్లు రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. లక్ష్యంకన్నా రూ.4 లక్షల కోట్ల అధిక వసూళ్లు జరగవచ్చని ఆయన తెలిపారు. భారీగా జరుగుతున్న ఆదాయపు పన్ను, కస్టమ్స్ సుంకాలు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు దీనికి కారణమని ఆయన అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపిన అంశాలు... ► పన్ను రాబడిలో వృద్ధి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి కంటే ఎక్కువగా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవస్థ పురోగతి దీనికి కారణం. ► 2022–23లో రూ.27.50 లక్షల కోట్ల ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యంలో ప్రత్యక్ష పన్నుల వాటా రూ.14.20 లక్షల కోట్లయితే, పరోక్ష పన్ను వసూళ్ల వాటా రూ.13.30 లక్షల కోట్లు. ► అయితే లక్ష్యాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు రూ.17.50 లక్షల కోట్లు, పరోక్ష పన్ను (కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీ) వసూళ్లు రూ.14 లక్షల కోట్లకు చేరవచ్చు. అంటే వసూళ్లు రూ.31.50 లక్షల వరకూ వసూళ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ అంచనాలకన్నా ఇది రూ.4 లక్షల కోట్ల అధికం. ► ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022–23) సైతం పన్నుల లక్ష్యం మరింత పెద్దగా ఉండొచ్చు. ► పన్ను వసూళ్ల మదింపునకు మేము విస్తృత స్థాయిలో డేటాను ఉపయోగిస్తున్నాము. ఆదాయపు పన్ను, జీఎస్టీ విభాగాలు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) నుండి డేటాను ఎప్పుటికప్పుడు పొందుతున్నాము. సాంకేతికత అధికారికీకరణ అనుకూలతను మెరుగుపరచడంతో డేటాను సమగ్ర స్థాయిలో పొందగలుగుతున్నాము. ► 2020–21తో పోల్చితే 2021–22లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 50 శాతం పెరిగి, రూ.14.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ► ఈ ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు తగ్గించినప్పటికీ ప్రభుత్వం బడ్జెట్లో నిర్దేశించిన లక్ష్యానికి అతి చేరువలో ఉండడం హర్షణీయం. కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల ద్వారా వరుసగా రూ.2.13 లక్షల కోట్లు, రూ.3.35 లక్షల కోట్ల చొప్పున వసూళ్లు జరగాలన్నది బడ్జెట్ లక్ష్యం. ► ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్స్ 2021–22 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్) సంబంధించి ఇప్పటి వరకూ 6.85 కోట్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 31 వరకూ తుది గడువు ఉండడంతో రిటర్న్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2021–22కిగాను ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్‌లు) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉన్న కార్పొరేట్లు, ఇతరులకు తుది గడువు నవంబర్ 7. గడువు తప్పినట్లయితే, పన్ను చెల్లింపుదారులు జరిమానా చెల్లించడం ద్వారా ఆలస్యంగా కూడా రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. దీనికి చివరి తేదీ డిసెంబర్ 31. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ 10 వరకూ రిఫండ్స్ విలువ (31 శాతం వృద్ధితో) రూ. 2లక్షల కోట్లు. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.10.54 లక్షల కోట్లుకాగా, రిఫండ్స్ పోను మిగిలిన మొత్తం రూ.8.54 లక్షల కోట్లు. వార్షిక బడ్జెట్ అంచనాల్లో ఈ విలువ 61.31 శాతానికి చేరింది. ► దేశంలో పలు రంగాలు మందగమనంలో ఉన్నప్పటికీ, ఎకానమీ పురోగతికి సంకేతమైన ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పురోగమిస్తుండడం హర్షణీయ పరిణామం. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఎనిమిది నెలలుగా రూ.1.40 లక్షల కోట్లు పైబడ్డాయి. ఇందులో రెండు నెలలు రూ.1.50 లక్షల కోట్లు దాటాయి. కట్టడిలో ద్రవ్యలోటు చక్కటి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందని భావిస్తున్నాం. 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. -
లక్ష్యానికి మించి ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం బడ్జెట్ అంచనా రూ.14.20 లక్షల కోట్ల కంటే, 30 శాతం అధికంగా వసూలు అవుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. దీని ఆధారంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సైతం పన్నుల లక్ష్యం మరింత పెద్దగా ఉండొచ్చన్నారు. పన్నుల ఎగువేతకు చెక్ పెట్టేందుకు వీలుగా ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించి టీడీఎస్ నిబంధనల్లో మార్పులు ఉంటాయని చెప్పారు. తదుపరి ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో వీటికి చోటు కల్పించే అవకాశం ఉందన్నారు. ‘‘ఆన్లైన్ గేమింగ్‌పై ప్రస్తుతం టీడీఎస్ మినహాయింపు నిబంధన ఉంది.దీన్ని సవరించడమా లేక ప్రస్తుత రూపంలోనే ఉంచడమా అన్నది చూడాలి’’అని ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో భాగంగా తెలిపారు. ఆన్లైన్ గేమింగ్ ఆదాయంపై 10 శాతం టీడీఎస్ తగ్గించిన తర్వాతే ఇన్వెస్టర్‌కు చెల్లింపులు చేసే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. మొత్తం మీద పస్త్రుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ.17.75–18.46 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని గుప్తా చెప్పారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ 10 వరకు వసూలైన ఆదాయం రూ.10.54 లక్షల కోట్లుగా ఉంది. ఇది అంచనాల కంటే 30 శాతం ఎక్కువ కావడం గమనార్హం. రిఫండ్లను తీసేసి చూస్తే నికరంగా రూ.8.71 లక్షల కోట్లు ఉంటుంది. బడ్జెట్ లక్ష్యంలో ఇది 61.31 శాతానికి సమానం. చదవండి: భారత్‌లో ట్విటర్ చాలా స్లో, మరీ దారుణం: ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్! -
పన్ను వసూళ్లు పెరగడానికి డీమానిటైజేషన్ కారణం
న్యూఢిల్లీ: పన్ను వసూళ్లు పెరిగేందుకు పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) కూడా తోడ్పడిందని రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు ఆషిమా గోయల్ తెలిపారు. అంతిమంగా .. పెద్ద సంఖ్యలో ట్యాక్స్‌పేయర్లపై తక్కువ స్థాయిలో పన్నులు విధించగలిగే ఆదర్శవంతమైన విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఇది దోహదపడగలదని ఆమె పేర్కొన్నారు. నల్ల ధనం చలామణీని అరికట్టేందుకు, డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా 2016 నవంబర్ 8న రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అసాధారణ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్లు, వ్యక్తిగత ఆదాయాలపై పన్నుల స్థూల వసూళ్లు 24 శాతం పెరిగి రూ. 8.98 లక్షల కోట్లకు చేరినట్లు ఆదాయ పన్ను విభాగం అక్టోబర్ 9న వెల్లడించింది. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఏడో నెలా రూ. 1.40 లక్షల కోట్ల పైగానే నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 26 శాతం పెరిగి (గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే) రూ. 1.47 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. -
రుణ లక్ష్యాన్ని తగ్గించుకున్న కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యాన్ని రూ.10,000 కోట్లు కుదించుకుంది. పన్ను వసూళ్లు గణనీయంగా పెరగడం దీనికి కారణం. భారీ పన్ను వసూళ్ల వల్ల ఉచిత రేషన్ పంపిణీపై అదనపు వ్యయం రూ.44,762 కోట్లు భర్తీ అయ్యే పరిస్థితి నెలకొందని, ఇది కేంద్ర రుణ లక్ష్యాన్ని తగ్గించుకోడానికి సైతం దోహదపడిందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన విండ్‌ఫాల్ ట్యాక్స్ కూడా ఖజానాకు లాభం ఒనగూర్చనుందని వివరించింది. 2022–23 బడ్జెట్ రూ.14.31 లక్షల కోట్ల మార్కెట్ రుణ సమీకరణలను నిర్దేశించుకుంది. తాజా కేంద్ర నిర్ణయంతో ఇది రూ.14.21 లక్షల కోట్లకు తగ్గనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–మార్చి మధ్య రూ.5.92 లక్షల కోట్ల (రూ.14.21 లక్షల కోట్లలో రూ.41.7 శాతం) రుణ లక్ష్యాలను జరపాల్సి ఉంది. ఇందులో ఒక్క సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా రూ.16,000 కోట్ల సమీకరణలు జరపనుంది. కాగా, సెప్టెంబర్ 17 నాటికి 30 శాతం అధికంగా (2020–21తో పోల్చి) రూ.8.36 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయి. -
ధనాధన్ ‘నవంబర్’!
భారత్ ఆర్థిక వ్యవస్థ నవంబర్‌లో మంచి ఫలితాలను నమోదుచేసినట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. వస్తు, సేవల పన్ను వసూళ్లు, ఎగుమతులు, తయారీ రంగం ఇలా ప్రతి కీలక విభాగమూ వృద్ధిలో దూసుకుపోయింది. ఆయా రంగాలను పరిశీలిస్తే.. జీఎస్టీ ఆదాయం రూ.1,31,526 కోట్లు న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నవంబర్‌లో రూ.1,31,526 కోట్లుగా నమోదయ్యాయి. ఎక్సైజ్ సుంకం, సేవల పన్ను, వ్యాట్ వంటి పలు రకాల పరోక్ష పన్నులను ఒకటిగా మార్చుతూ 2017 జూలై నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత, జీఎస్టీ ద్వారా ఈ స్థాయి వసూళ్లు జరగడం ఇది రెండవసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో వసూలయిన రూ.1,39,708 కోట్లు ఇప్పటి వరకూ భారీ వసూలుగా రికార్డయ్యింది. కాగా, 2020 నవంబర్ నెలతో (1.05 లక్షల కోట్లు) పోల్చితే తాజా సమీక్షా నెల వసూళ్లలో 25 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఇక 2019 ఇదే నెలతో పోల్చితే వసూళ్లు 27 శాతం ఎగశాయి. వ్యాపార క్రియాశీలత మెరుగుపడ్డం, ఎకానమీ రికవరీ పటిష్టత వంటి అంశాలు తాజా సమీక్షా నెల్లో మంచి ఫలితాలకు కారణం. ఇక జీఎస్టీ వసూళ్లు లక్షకోట్లు పైబడ్డం కూడా ఇది వరుసగా ఐదవనెల. పన్ను ఎగవేతలను నిరోధించడానికి కేందం తీసుకుంటున్న చర్యలు ఫలితమిస్తున్నాయని, జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడానికి ఇదీ ఒక కారణమని ఆర్థిక శాఖ పేర్కొంది. అంకెల్లో చూస్తే... ► నవంబర్‌లో మొత్తం స్థూల వసూళ్లు రూ.1,31,526 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.23,978 కోట్లు. ► స్టేట్ జీఎస్టీ రూ.31,127 కోట్లు. ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.66,815 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.32,165 కోట్లు సహా) ► సెస్ రూ.9,606 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలు చేసిన రూ.653 కోట్లుసహా) ఇదిలాఉండగా, ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల జీఎస్టీ వసూళ్ల అంకెల్లో సవరణ జరిగింది. ఎగుమతులు 26 % అప్ భారత్ ఎగుమతులు నవంబర్‌లో గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 26.49 శాతం ఎగశాయి. విలువ రూపంలో 29.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్, పెట్రోలియం, రసాయనాలు, మెరైన్ ఉత్పత్తుల వంటి పలు విభాగాలు పురోగతిలో నిలిచాయి. 2020 నవంబర్‌లో ఎగుమతుల విలువ 23.62 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు 57.18 శాతం పెరిగి 53.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెల్లో ఈ విలువ 38.81 బిలియన్ డాలర్లు. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 23.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వార్షికంగా చూస్తే, వాణిజ్యలోటు రెట్టింపు కావడం గమనించాల్సిన మరో అంశం. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మొత్తం ఎగుమతుల్లో 28.19 శాతం వాటా ఉన్న ఇంజనీరింగ్ ఎగుమతులు 37% పెరిగి 8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎగుమతులు 145.3% పెరిగి 3.82 బిలియన్ డాలర్ల్లకు చేరాయి. ► రత్నాభరణాల దిగుమతులు మాత్రం 11% క్షీణించి 2.4 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ► సమీక్షా నెల్లో పసిడి దిగుమలు 8 శాతం పెరిగి 4.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తుల దిగుమతులు 132.44 శాతం పెరిగి 14.68 బిలియన్ డాలర్లకు చేరాయి. ► బొగ్గు, కోక్, బ్రికెట్స్ దిగుమతులు 135.81% పెరిగి 3.58 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ... కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే ఎగుమతులు విలువ 50.71 శాతం పెరిగి 174.15 బిలియన్ డాలర్ల నుంచి 262.46 బిలియన్ డాలర్లకు ఎగసింది. కరోనా ముందస్తు సమయం 2019 ఏప్రిల్–నవంబర్‌తో పోల్చినా ఎగుమతులు 24 శాతం పెరగడం గమనార్హం. అప్పట్లో ఈ విలువ 211.17 బిలియన్ డాలర్లు. 10 నెలల గరిష్టానికి ‘తయారీ’ భారత్ తయారీ రంగం నవంబర్‌లో పురోగమించింది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 57.6కు ఎగసింది. అక్టోబర్‌లో ఈ సూచీ 55.9 వద్ద ఉంది. గడచిన 10 నెలల్లో ఈ స్థాయి మెరుగుదల ఇదే తొలిసారి. కాగా ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా లెక్కించడం జరుగుతుంది. దీర్ఘకాలిక సగటు 53.6కన్నా కూడా సూచీ పైన ఉండడం తాజా సమీక్షా నెల ముఖ్యాంశం. మూడు నెలల వరుస క్షీణత అనంతరం నవంబర్‌లో ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా మెరుగుపడినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పాలీయానా డీ లిమా పేర్కొన్నారు. వరుసగా ఐదు నెలల తర్వాత నిర్వహణా పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని కూడా ఆమె తెలిపారు. -
పటిష్ట బాటన ఎకానమీ
చండీగఢ్: భారత్ ఎకానమీ పటిష్ట పునరుజ్జీవ బాటన పయనిస్తోందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శుక్రవారం పేర్కొన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), ప్రత్యక్ష పన్నుల వసూళ్లు భారీగా నమోదుకావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని స్టాక్ మార్కెట్ కూడా ప్రతిబింబిస్తోందన్నారు. రిటైల్, చిన్న ఇన్వెస్టర్లు సైతం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. మీడియాను ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► కరోనా సవాళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవ బాట పట్టిందనడానికి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ► ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించి 2021–22 అర్ధ వార్షిక లక్ష్యాలను (ఏప్రిల్–సెపె్టంబర్) ఇప్పటికే సాధించడం జరిగింది. జీఎస్టీ వసూళ్లు సగటున రూ.1.11 లక్షల కోట్లు– రూ.1.12 లక్షల కోట్ల శ్రేణిలో ఉన్నాయి. 2022 మార్చితో ఆర్థిక సంవత్సరం (2021–22) ముగిసే నాటికి ఈ సగటు రూ.1.15 లక్షల కోట్లుగా నమోదయ్యే వీలుంది. ► స్టాక్ మార్కెట్‌పై ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగింది. కంపెనీల లిస్టింగ్, సంబంధిత నిబంధనల్లో పారదర్శకత దీనికి ప్రధాన కారణం. అందువల్లే గతంలో మ్యూచువల్ ఫండ్స్‌పై మొగ్గుచూపే ఎక్కువగా రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు డీ మ్యాట్ అకౌంట్ ద్వారా ప్రత్యక్షంగా మార్కెట్‌పై కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ► పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) వల్ల వ్యవస్థలో నల్లధనం, నకిలీ కరెన్సీ కట్టడి జరిగింది. ► పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోనికి తెచ్చే అంశంపై పరోక్ష పన్నుల అత్యున్నత స్థాయి మండలే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ► రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుంది. ► ఆర్థిక కార్యకలాపాల విషయంలో ‘అందరితో కలిసి, అందరి సంక్షేమం కోసం, అందరి విశ్వాసంతో, అందరి కృషితో’ పనిచేయాలన్నది కేంద్రం విధానం. ఇదే విధానానికి కేంద్రం కట్టుబడి ఉంది. ► కరోనా విసిరిన సవాళ్ల నేపథ్యంలో వ్యాపార సంస్థలు సైతం తమ వ్యాపార విధానాలను మార్చుకుంటున్నాయి. ప్రత్యేకించి డిజిటలైజేషన్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ► జన్‌ధన్ పథకం వల్ల 80 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకం కింద 40 కోట్లకుపైగా అకౌంట్లు ఉన్నాయి. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 74% వృద్ధి
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు (వ్యక్తిగత, కార్పొరేట్) సెపె్టంబర్ 22వ తేదీ నాటికి (2021 ఏప్రిల్ నుంచి) నికరంగా రూ.5.70 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలి్చతే ఇది 74 శాతం అధికం. అడ్వాన్స్ పన్నులు, మూలం వద్ద పన్ను (టీడీఎస్) భారీ వసూళ్లు దీనికి కారణం. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు... ► ఏప్రిల్–1 నుంచి సెపె్టంబర్ 22 మధ్య నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5,70,568 కోట్లు. గత ఏడాది ఇదే కాలం (రూ.3.27 లక్షల కోట్లు) వసూళ్లతో పోల్చి చూస్తే 74.4 శాతం పెరుగుదల. కరోనా ముందస్తు సమయం 2019–20 ఇదే కాలంతో పోలి్చనా ఈ వసూళ్లు 27 శాతం అధికం. సంబంధిత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వసూళ్ల పరిమాణం రూ.4.48 లక్షల కోట్లు. ► ఇక స్థూలంగా చూస్తే, ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 47 శాతం పెరుగుదలతో రూ.4.39 లక్షల కోట్ల నుంచి రూ.6.45 లక్షల కోట్లకు ఎగశాయి. కరోనా కాలానికి ముందు 2019–20 ఆర్థిక సంవత్సరంతో (2019 సెపె్టంబర్ 22 వరకూ) పోలి్చతే 16.75 పెరుగుదల నమోదయ్యింది. అప్పట్లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 5.53 లక్షల కోట్లు. ఇప్పటివరకూ రిఫండ్స్ రూ.75,111 కోట్లు. -
కేంద్ర ప్రభుత్వానికి ఇం‘ధనం’
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు ఆల్‌టైం గరిష్ట స్థాయి నుంచి భారీగా దిగివచ్చినా దేశీయంగా ఇంధనాల రేట్లు మాత్రం రికార్డు గరిష్ట స్థాయిలో తిరుగాడుతున్నాయి. వీటిపై ప్రభుత్వం పన్నుల మోత మోగిస్తుండటమే ఇందుకు కారణం. గడిచిన ఆరేళ్లలో ఇలా పెట్రోల్, డీజిల్‌పై పన్నుల వసూళ్లు 300% పెరిగాయి. మోదీ సర్కార్ ఏర్పాటైన తొలి ఏడాది 2014–15లో ఎక్సైజ్ డ్యూటీ రూపంలో పెట్రోల్‌పై రూ. 29,279 కోట్లు, డీజిల్‌పై రూ. 42,881 కోట్లు కేంద్రం వసూలు చేసింది. వీటికి సహజ వాయువును కూడా కలిపితే 2014–15లో వీటిపై ఎక్సైజ్ రూపంలో రూ. 74,158 కోట్లు ప్రభుత్వానికి చేరాయి. ఈ వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో ఏకంగా రూ. 2.95 లక్షల కోట్లకు చేరాయి. కేవలం పెట్రోల్, డీజిల్‌పై పన్నుల వసూళ్లు రూ. 2.94 లక్షల కోట్లకు పెరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్‌సభకు తెలిపారు. ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయంలో.. పెట్రోల్, డీజిల్, సహజ వాయువుపై విధించే ట్యాక్సుల వసూళ్ల రూపంలో వచ్చేది 2014–15లో 5.4%గా ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం 12.2%కి పెరిగిందని ఆయన వివరించారు. పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ 2014లో లీటరుకు రూ. 9.48గా ఉండగా అదిప్పుడు రూ. 32.90కి పెరిగింది. డీజిల్‌పై రూ. 3.56 నుంచి రూ. 31.80కి చేరింది. -
ప్రైవేటు బ్యాంకులకు సై
న్యూఢిల్లీ: ఇంతకాలం ప్రభుత్వ అధికారిక లావాదేవీలు, పన్నుల వసూళ్లు తదితర వ్యాపారం ప్రభుత్వరంగ బ్యాంకులు, కొన్ని దిగ్గజ ప్రైవేటు బ్యాంకులకే సొంతం కాగా.. ఇకపై అన్ని ప్రైవేటు బ్యాంకులనూ ఇందుకు అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. పన్నుల వసూళ్లు, పెన్షన్ చెల్లింపులు, చిన్న మొత్తాల పొదుపు పథకాల సేవలు సహా అన్ని రకాల ప్రభుత్వాల వ్యాపార లావాదేవీల నిర్వహణకు అన్ని ప్రైవేటు బ్యాంకులను అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం కస్టమర్లకు సేవల పరంగా సౌకర్యాన్నిస్తుందని, పోటీని, సేవల్లో సామర్థ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నట్టు ఆర్థిక శాఖా పేర్కొంది. ‘ప్రభుత్వ వ్యాపారం ప్రైవేటు బ్యాంకులు నిర్వహించే విషయమై ఉన్న ఆంక్షలను తొలగించాము. ఇప్పుడు అన్ని బ్యాంకులు పాల్గొనొచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ప్రైవేటు బ్యాంకులూ సమాన భాగస్వాములు’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆంక్షలు తొలగించడంతో ప్రైవేటు బ్యాంకులనూ ప్రభుత్వ వ్యాపారం, ప్రభుత్వ ఏజెన్సీ వ్యాపార నిర్వహణకు.. ప్రభుత్వరంగ బ్యాంకులతో సమానంగా గుర్తించేందుకు ఆర్బీఐకి అధికారాలు లభించినట్టు అయింది. -
రికార్డు స్థాయి జీఎస్టీ ఆదాయం
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత (2017 జూలై 1) ఒక్క నెలలో అత్యధిక పన్ను వసూళ్ల రికార్డు 2020 డిసెంబర్ నెలకు నమోదైంది. ఏకంగా 1,15,174 కోట్ల మేర జీఎస్టీ రూపంలో పన్ను వసూలైంది. 2019 డిసెంబర్లో ఉన్న రూ.1.03 లక్షల కోట్ల ఆదాయంతో పోలిస్తే 12 శాతం వృద్ధి నెలకొంది. లాక్డౌన్ల తర్వాత ఆర్థిక కార్యకలాపాల్లో వేగాన్ని ఈ వసూళ్లు తెలియజేస్తున్నాయని నిపుణుల అభిప్రాయం. 2019 ఏప్రిల్ నెలలో రూ.1,13,866 కోట్ల జీఎస్టీ ఆదాయం ఇప్పటివరకు రికార్డుగా ఉంది. ఆర్థిక రికవరీ వేగవంతం ‘‘జీఎస్టీ ఆదాయం క్రమంగా పెరగడం, సున్నితమైన రూ.లక్ష కోట్ల మార్క్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా మూడో నెలలోనూ దాటడం అన్నది.. కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక రికవరీ వేగాన్ని సంతరించుకోవడంతోపాటు, జీఎస్టీ ఎగవేతలకు, నకిలీ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమం వల్లే’’నని కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. జీఎస్టీ వసూళ్లన్నవి ఆర్థిక కార్యకలాపాల వాస్తవ చిత్రాన్ని తెలియజేసేవే. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు 2020 మార్చి చివరి వారం నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కేంద్రం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ తర్వాతి నెల ఏప్రిల్‌కు సంబంధించిన జీఎస్టీ వసూళ్లు రూ.32,172 కోట్లకు పడిపోయాయి. మే తర్వాత నుంచి లాక్డౌన్ నియంత్రణలను క్రమంగా సడలిస్తూ రావడంతో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇదే జీఎస్టీ వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. ‘‘పెద్ద రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్లలో 6–15 శాతం మధ్య వృద్ధిని చూపించాయి. వరుసగా జీఎస్టీ ఆదాయాలు వృద్ధిని చూపిస్తుండడం ఆర్థిక వ్యవస్థ సామర్థ్యంపై విశ్వాసాన్ని కలిగిస్తుంది. అలాగే, వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా తిరిగి మొదలయ్యాయని, వస్తు, సేవలకు డిమాండ్ అధికంగా ఉండడాన్ని తెలియజేస్తోంది’’ అని డెలాయిట్ ఇండియా సీనియర్ డైరెక్టర్ అమిత్ గుప్తా తెలిపారు. పరిశ్రమ తిరిగి సాధారణ స్థితికి వస్తోందని జీఎస్టీ ఆదాయంలో వృద్ధి తెలియజేస్తోందంటూ సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. కోవిడ్–19 కారణంగా కుంగిన ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగాన్ని సంతరించుకున్నట్టు వస్తు సేవల పన్ను వసూళ్లు స్పష్టం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ 2020 మాసంలో రూ. 2,581 కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. అంతకుముందు ఏడాది ఇదే మాసంలో రూ. 2,265 కోట్ల జీఎస్టీ వసూలవగా.. దీంతో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదైంది. తెలంగాణలో 2019 డిసెంబర్లో జీఎస్టీ ఆదాయం రూ. 3,420 కోట్లుగా ఉంటే.. 2020 డిసెంబర్ లో 4 శాతం వృద్ధితో రూ. 3,542 కోట్ల మేర వసూలైంది. ఇతర వివరాలు.. ► 2020 డిసెంబర్లో సెంట్రల్ జీఎస్టీ రూ.21,365 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.27,804 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.57,426 కోట్లు, సెస్సు రూ.8,579 కోట్లుగా ఉంది. ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుంచి రూ.23,276 కోట్లు సెంట్రల్ జీఎస్టీకి, రూ.17,681 కోట్లు స్టేట్ జీఎస్టీకి కేంద్రం సర్దుబాటు చేసింది. ఆదాయ వాటా పరిష్కారం అనంతరం.. డిసెంబర్ నెలకు సంబం ధించి కేంద్రానికి సెంట్రల్ జీఎస్టీ ఆదాయం రూ.44,641 కోట్లు, రాష్ట్రాలకు స్టేట్ జీఎస్టీ ఆదాయం రూ.45,485 కోట్లుగా ఉంది. ► నవంబర్ నెలకు సంబంధించి జీఎస్టీఆర్–3బీ రిటర్నులు డిసెంబర్ 31 నాటికి 87 లక్షలు దాఖలయ్యాయి. -
లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: అక్టోబర్ నెలలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.05 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే జీఎస్టీ కలెక్షన్స్ లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇదే ప్రథమం. గత నెలలో మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,05,155 కోట్లు కాగా.. ఇందులో సీజీఎస్టీ రూ.19,193 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.5,411 కోట్లు, ఐజీఎస్టీ రూ.52,540 కోట్లు (ఇందులో రూ.23,375 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి), సెస్ ఆదాయం రూ.8,011 కోట్లు (ఇందులో రూ.932 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి) ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019 అక్టోబర్‌తో పోలిస్తే.. ఈ ఏడాది అక్టోబర్‌లో 10 శాతం ఆదాయం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది అక్టోబర్‌లో జీఎస్టీ ఆదాయం రూ.95,379 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జీఎస్టీ ఆదాయం రూ.1.05 లక్షల కోట్లు, మార్చిలో రూ.97,597 కోట్లు, ఏప్రిల్‌లో రూ.32,172 కోట్లు, మేలో రూ.62,151 కోట్లు, జూన్‌లోరూ.90,917 కోట్లు, జూలైలో రూ.87,422 కోట్లు, ఆగస్టులో రూ.86,449 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.95,480 కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో గ్రాస్ జీఎస్టీ ఆదాయం రూ.5.59 లక్షల కోట్లుగా ఉండగా.. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 20 క్షీణత నమోదైందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 31 నాటికి 80 లక్షల జీఎస్టీఆర్–3బీ రిటర్న్‌లు ఫైల్ అయ్యాయని ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ భూషన్ పాండే తెలిపారు. రూ.50 వేల కంటే విలువైన వస్తువుల రవాణాలో తప్పనిసరి అయిన ఈ–వే బిల్లుల చెల్లింపుల్లోనూ అక్టోబర్ నెలలో 21 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం రోజుకు 29 లక్షల ఈ–ఇన్వాయిస్ జనరేట్ అవుతున్నాయి. -
పారదర్శక పన్ను విధానం
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల వసూళ్ల విషయంలో అవినీతిని గణనీయంగా తగ్గించే దిశగా సిద్ధం చేసిన పలు సంస్కరణలను భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. పన్నుల మదింపు, వివాదాలపై అప్పీళ్లు అంశాల్లో వ్యక్తుల ప్రమేయం (ఫేస్‌లెస్ అసెస్మెంట్, అప్పీల్స్) లేకుండా చేయడం వీటిల్లో ఒకటి. పారదర్శక, నీతివంతమైన, ఉచితంగా అందుబాటులో ఉండే పన్ను సేకరణ విధానం కోసం పన్ను చెల్లింపుదారుల చార్టర్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తెలిపారు. ‘‘పారదర్శక పన్ను విధానం– నిజాయితీపరుల గుర్తింపు’’ పేరుతో సిద్ధం చేసిన ఓ వేదికను ఆన్లైన్ పద్ధతిలో ఆవిష్కరించిన మోదీ మాట్లాడుతూ దేశ జనాభాలో అతితక్కువ మంది అంటే కేవలం 1.5 కోట్ల మంది మాత్రమే పన్నులు కడుతున్నారని, ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సిన వారు స్వచ్ఛందంగా ఆ పనిచేయాలని పిలుపునిచ్చారు. . వచ్చే నెల నుంచి ఫేస్‌లెస్ అసెస్మెంట్.. ప్రత్యక్ష పన్నుల విధానంలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా పన్ను చెల్లింపుదారుల చార్టర్, వ్యక్తుల ప్రమేయం లేని పన్ను మదింపును అమలు చేయడం ద్వారా పన్ను చెల్లింపులను అధికం చేయడంతో పాటు, నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ప్రోత్సహించడం వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త సంస్కరణల ఫలితంగా పన్ను చెల్లింపుదారులు ఏ పనికోసమైనా ఐటీ కార్యాలయాన్ని, అధికారిని సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడదు. చార్టర్ కూడా గురువారం నుంచే అమల్లోకి రానుండగా ఫేస్‌లెస్ అసెస్మెంట్ అనేది సెప్టెంబర్ 25 నుంచి అమలు కానుంది. వ్యక్తుల పన్ను చెల్లింపులు, అప్పీళ్లు, పరిశీలన అన్నీ ఇప్పటివరకూ ఆయా వ్యక్తులున్న నగరాల్లోనే జరుగుతూండగా ఇకపై కేంద్రీకృత కంప్యూటర్ వ్యవస్థ ఐటీ రిటర్న్స్ స్వీకరిస్తుందని, నిశిత పరిశీలన అవసరమైన వాటిని తనంతట తానే యాదృచ్ఛికంగా అధికారులకు కేటాయిస్తుందని ప్రధాని వివరించారు. ఈ అధికారులు నిర్వహించే స్క్రూటినీపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఏ నగరంలోని అధికారికి ఎవరి పన్ను రిటర్న్‌లు స్క్రూటినీకి వస్తాయో? ఏ అధికారి పర్యవేక్షిస్తారో తెలియదని చెప్పారు. కేంద్రీకృత కంప్యూటర్ వ్యవస్థ మాత్రమే వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తుందని, వాటికి వివరణ కూడా వ్యక్తిగతంగా కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలోనే ఇవ్వవచ్చన్నారు. నిష్పాక్షికత పెరుగుతుంది: ఆర్థిక మంత్రి వ్యక్తుల ప్రమేయం లేకుండా పన్నుల స్క్రూటినీ, అప్పీళ్లు వంటి సంస్కరణలతో పన్ను చెల్లింపుదారుపై నిబంధనల పాటింపు భారం తగ్గుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే పన్ను వ్యవస్థలతో నిజాయితీ, నిష్పాక్షికత పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. పన్నుల వ్యవస్థలో ఇది చరిత్రాత్మక రోజని ఆమె అభివర్ణించారు. పన్ను చెల్లింపుదారులకు సాధికారతనివ్వడం, పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయడం, నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని గౌరవించడం అన్నది ప్రధాని విజన్ అని పేర్కొన్నారు. అంతర్జాతీయ అభియోగాలకు మినహాయింపు.. అంతర్జాతీయ స్థాయి కేసులు, తనిఖీ .. జప్తు చేయాల్సిన కేసులు మినహా స్క్రూటినీకి ఎంపిక చేసిన వాటన్నింటికీ ఫేస్‌లెస్ విధానం కింద మదింపు ప్రక్రియ వర్తిస్తుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. అసెస్మెంట్ ఆర్డర్లన్నీ ఇకపై ఫేస్‌లెస్ అసెస్మెంట్ స్కీమ్ 2019 కింద జాతీయ ఈ–అసెస్మెంట్ సెంటర్ ద్వారా జారీ అవుతాయని వివరించింది. స్క్రూటినీ అసెస్మెంట్కు సంబంధించిన వివరాల సేకరణ కోసం జరిపే సర్వేలను ఇకపై ఇన్వెస్టిగేషన్ విభాగం, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) డైరెక్టరేట్ మాత్రమే నిర్వహిస్తాయని సీబీడీటీ తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనకరం ఫేస్‌లెస్ అసెస్మెంట్, ఫేస్‌లెస్ అప్పీలు తదితర భారీ సంస్కరణలన్నీ పన్ను చెల్లింపుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రధాని ఆకాంక్షిస్తున్నట్లుగా స్వావలంబన సాధించేందుకు ఈ విధానం మరింతగా తోడ్పడగలదు. – ఉదయ్ కోటక్, ప్రెసిడెంట్, సీఐఐ మైలురాయి.. వ్యవస్థాగత సంస్కరణలకు సంబంధించి ఇది మరో మైలురా యి. ఇది పన్ను చెల్లింపుదారుల్లో మరింతగా విశ్వాసాన్ని పెంపొం దించగలదు. – సంగీతా రెడ్డి, ప్రెసిడెంట్, ఫిక్కీ సరైన దిశగా సంస్కరణలు ప్రభుత్వం, పన్ను చెల్లింపుదారుల మధ్య సంబంధాలు పరస్పర విశ్వాసం పెంపొందించేవిగా, భయాందోళనలను కలిగించని విధంగా ఉండాలి. ఆ దిశగా ఈ–అసెస్మెంట్ మొదలైనవి సరైన సంస్కరణలు. – దీపక్ సూద్, సెక్రటరీ, అసోచాం చరిత్రాత్మకం ప్రత్యక్ష పన్నుల విధానంలో తీసుకువచ్చిన మార్పులు చరిత్రాత్మకమైనవి. నిజాయితీగా పన్ను చెల్లించే వారిని గౌరవించేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఫేస్‌లెస్ అసెస్మెంట్, ట్యాక్స్‌పేయర్స్ చార్టర్ వంటివి భారతీయ పన్ను విధానాన్ని మరింత బలోపేతం చేస్తాయన్న విశ్వాసం నాకు ఉంది. – అమిత్ షా, హోంశాఖ మంత్రి -
పన్ను వసూళ్లు... 31% క్షీణత
ముంబై: పన్ను వసూళ్లపై కరోనా ప్రభావం తీవ్రంగా కనిపించింది. జూన్ 15 వరకూ విడుదలైన అధికారిక ప్రకటన ప్రకారం స్థూల పన్ను వసూళ్లు (–) 31 శాతం క్షీణించాయి. రూ.1,37,825 కోట్లుగా నమోదయ్యాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం జూన్ 15 వరకూ చూస్తే, ఈ మొత్తం రూ.1,99,755 కోట్లు. పన్ను వసూళ్లు ఇంతలా క్షీణతను నమోదుచేసుకోవడానికి ముందస్తు పన్ను వసూళ్లు 76 శాతం క్షీణతను నమోదుచేసుకోవడం ప్రధాన కారణమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► రిఫండ్స్ పోను మిగిలిన నికర పన్ను వసూళ్ల మొత్తం 32 శాతం క్షీణతతో రూ.1,36,941 కోట్ల నుంచి రూ.92,681 కోట్లకు తగ్గింది. రిఫండ్స్ పరిమాణం రూ.45,143 కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో (రూ.62,813 కోట్లు) పోల్చిచూస్తే, 28 శాతం తగ్గాయి. ► 2019–20 ఆర్థిక సంవత్సరం జూన్ 15 వరకూ చూస్తే, ముందస్తు పన్ను వసూళ్లు రూ.48,917 కోట్లుగా ఉంటే, ఈ ఏడాది ఇదే కాలానికి ఈ మొత్తం 76.5 శాతం పతనంతో రూ.11,714 కోట్లకు పడిపోయింది. ► ఒక్క ముందస్తు కార్పొరేట్ పన్ను వసూళ్లు 79 పడిపోయి, రూ.39,405 కోట్ల నుంచి రూ.8,286 కోట్లకు పడిపోయింది. ఇందుకు సంబంధించి వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 64% క్షీణతతో రూ.9,512 కోట్ల నుంచి రూ.3,428 కోట్లకు తగ్గాయి. ► అడ్వాన్స్ పన్ను చెల్లింపులకు తుది గడువు జూన్ 15. అడ్వాన్స్ పన్ను చెల్లింపుల పరిధిలోనికి వచ్చే అసెస్సీలు, వారు చెల్లించాల్సిన మొత్తంలో 15 శాతాన్ని మొదటి త్రైమాసికంలో చెల్లించాలి. 25 శాతం చొప్పున తదుపరి రెండు త్రైమాసికాల్లో చెల్లించాలి. 35 శాతాన్ని నాల్గవ త్రైమాసికంలో చెల్లించాలి. ► 2020–21 ఆర్థిక సంవత్సరం స్థూల పన్ను వసూళ్ల లక్ష్యం రూ.24.23 లక్షల కోట్లు. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చిచూస్తే (రూ.21.63 లక్షల కోట్లు) ఈ పరిమాణం 12% అధికం. -
ఆ వసూళ్లు రూ. లక్ష కోట్లు దాటేశాయ్!
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం నెలకొన్నా జీఎస్టీ వసూళ్లు వరుసగా రెండో నెల డిసెంబర్‌లోనూ రూ. లక్ష కోట్లు దాటాయి. 2018 డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లు రూ. 97,276 కోట్లు కాగా గడిచిన ఏడాది డిసెంబర్లో పన్ను వసూళ్లు 16 శాతం వృద్ధితో రూ. 1.03 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక 2019 నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 1,03,492 కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్టీ వసూళ్లలో అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏకంగా 124 శాతం వృద్ధి నమోదైందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నాగాలాండ్‌లో 88 శాతం, జమ్ము కశ్మీర్లో 40 శాతం మేర జీఎస్టీ వసూళ్లు పెరిగాయని తెలిపింది. ఇక గత నెలలో వసూలైన జీఎస్టీలో రూ. 19,962 కోట్లు సీజీఎస్టీకాగా, రూ. 26,792 కోట్లు ఎస్జీఎస్టీ, రూ. 48,099 కోట్లు ఇంటిగ్రేటెడ్ జీఎస్టీగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. -
లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెలలో రూ. లక్ష కోట్లను దాటాయి. జీఎస్టీ వసూళ్లు మూడు నెలల తర్వాత లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇదే. గత ఏడాది నవంబర్‌లో రూ.97,637 కోట్లు, (ఈ ఏడాది అక్టోబర్‌లో రూ.95,380 కోట్లుగా) ఉన్న జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది నవంబర్‌లో 6 శాతం వృద్ధితో రూ.1.03 లక్షల కోట్లకు పెరిగాయి. 2017, జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే మూడో అత్యధిక వసూళ్లు. కాగా ఈ వసూళ్లు లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇది ఎనిమిదో నెల. అంతకు ముందు రెండు నెలల్లో ప్రతికూల వృద్ధిని నమోదు చేసిన జీఎస్టీ వసూళ్లు పండుగల డిమాండ్ పుణ్యమాని ఈ నవంబర్‌లో పెరిగాయి. వినియోగం పెరగడాన్ని, జీఎస్టీ అమలు మెరుగుపడటాన్ని పెరిగిన ఈ వసూళ్లు సూచిస్తున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
రూ లక్ష కోట్లు దాటిన ఆ వసూళ్లు..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం నేపథ్యంలోనూ నవంబర్ మాసంలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్ధాయిలో నమోదయ్యాయి. 2017 జులైలో జీఎస్టీ అమలు ప్రారంభమైనప్పటి నుంచి ఇవి మూడో అత్యధిక వసూళ్లుగా నమోదయ్యాయి. నవంబర్‌లో రూ 1,03,492 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇందులో రూ సెంట్రల్ జీఎస్టీ వాటా రూ 19,592 కోట్లు కాగా, స్టేట్జీఎస్టీ వాటా రూ 27,144 కోట్లు, ఉమ్మడి జీఎస్టీ రూ 49,028 కోట్లని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా జీఎస్టీ అమలవుతున్నప్పటి నుంచి పన్ను వసూళ్లు రూ లక్ష కోట్లు దాటడం ఇది ఎనిమిదివసారి కావడం గమనార్హం. ఇక ఈ ఏడాది అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు 95,880 కోట్లు కాగా, గత ఏడాది ఇదే (నవంబర్)నెలలో జీఎస్టీ వసూళ్లు రూ 97,637 కోట్లుగా నమోదయ్యాయి. -
పన్ను వసూళ్లలో భేష్
సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్ష పన్ను వసూళ్లలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు దేశంలోనే ఐదో స్థానంలో ఉన్నాయని ఏపీ, తెలంగాణ ఇన్‌కంట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ శంకరన్ వెల్లడించారు. ఆదాయ పన్ను శాఖ 159వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శంకరన్ మాట్లాడుతూ, దేశంలో ఆర్థిక వనరులు పెరగాలన్నా.. అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడాలన్నా.. నిజాయతీగా పన్నులు చెల్లించాలని ప్రజలకు సూచించారు. దేశంలో ప్రతీ పౌరుడు నిజాయతీగా, సులువుగా పన్నులు చెల్లించేందుకు వీలుగా సాంకేతికతను వాడుకుంటున్నామని చెప్పారు. ఈఫైలింగ్కు అపూర్వ స్పందన వస్తోందని తెలిపారు. 2018–19 ఏడాదిలో 6.68 కోట్ల ఈఫైలింగులు రావడమే దీనికి నిదర్శనమని అన్నారు. దీన్ని మరింత సులభతరం చేస్తామని చెప్పారు. ప్రత్యక్ష పన్నుల విషయంలో దేశంలో గణనీయ వృద్ధి నమోదవుతోందని తెలిపారు. 2014–15లో రూ.6.95 లక్షల కోట్లు పన్ను రూపంలో వసూళ్లవగా 2018–19లో అది రూ.11.37 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. రూ.4.41 లక్షల కోట్ల అభివృద్ధితో 63.5 శాతం వృద్ధి రేటు నమోదవ్వడం విశేషమని కొనియాడారు. అదేవిధంగా ఏపీ, తెలంగాణల్లో వృద్ధి రేటు కూడా బాగుందన్నారు. 2014–15లో వృద్ధి రేటు రెండు రాష్ట్రాల నుంచి రూ.31,762 వేల కోట్లు ఉండగా, 2018–19 వరకు అది రూ.52,040 కోట్లకు చేరిందని తెలిపారు. ఐదేళ్లలో 82 శాతం వృద్ధి నమోదు చేయడం రికార్డని కొనియాడారు. దేశంలో ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ తరువాత తెలుగు రాష్ట్రాలు దేశానికి ఆదాయం ఇవ్వడంలో ఐదో స్థానంలో నిలిచాయని ప్రశంసించారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పెరుగుతుండటం దేశానికి శుభసూచకమని అన్నారు. ఐఏఎస్‌కు ఎంపికైన అంధ ఉద్యోగి కట్టా సింహాచలాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డీజీఐటీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆర్.కె.పల్లికల్, డి.జి.ఇన్వెస్టిగేషన్ ఆర్.హెచ్.పాలీవాల్, చీఫ్ కమిషనర్ శ్రీ అతుల్ ప్రణయ్, నల్సార్ యూనివర్సిటీ వీసీ ఫైజల్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. అనంతరం పన్ను చెల్లింపులో అగ్రస్థానంలో నిలిచిన పలు కంపెనీలకు అవార్డులు అందజేశారు. -
వరుసగా మూడోసారి రూ. లక్ష కోట్లు దాటేశాయి
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ వసూళ్లు వరుసగా మూడవ నెలలో కూడా లక్ష కోట్ల మార్క్‌ను దాటాయి. మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి మందగించినప్పటికీ జీఎస్టీ వసూళ్లు బాగా పుంజుకున్నాయి. దీంతో మే నెలలో రూ. 100289 కోట్లు వసూలయ్యాయి. వార్షిక ప్రాతిపదికన వసూళ్లు, 6.67 శాతం పుంజుకోగా, ఆదాయం 2.21శాతం పెరిగి 94,016 కోట్ల రూపాయలుగా ఉంది. జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ మొత్తం రు. 1,13,865 కోట్లగా ఉండగా, మార్చిలో రూ. 1,06,577 కోట్లుగా నమోదయ్యాయి. శనివారం ఆర్థికమంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. సెంట్రల్ జీఎస్టీ ఆదాయం రూ .17,811 కోట్లు, ఎస్జీఎస్టీ రూ 24,462 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ఆదాయం. రూ 49,891 కోట్లు. చెస్ వసూళ్లు రూ .8,125 కోట్లు. 2019 మే నెలలో 3,108 రిటర్న్స్ దాఖలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
గ్రేటర్‌దే సింహభాగం
సాక్షి సిటీబ్యూరో: ఉన్నతాధికారులు, సిబ్బంది సమష్టి కృషితో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం గతంలో ఎన్నడూ లేని విధంగా గణనీయంగా పెరిగింది. వాణిజ్య పన్ను ల శాఖ ఆదాయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవగా, రాష్ట్ర ఆదాయంలో గ్రేటర్ తొలివరుసలో ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను వాణిజ్య పన్నుల ద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.46 వేల కోట్లు ఆదాయం వచ్చింది. ఇందులో గ్రేటర్ పరిధిలోని ఏడు డివిజన్ల నుంచే దాదాపు 80–85 శాతం ఆదాయం సమకూరడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 11 డివిజన్లు ఉండగా గ్రేటర్ పరిధిలోని ఏడు డివిజన్లలో రికార్డు స్థాయిలో వసూళ్లు జరిగాయి. ఈ ఏడాది మార్చి నెల వృద్ధి రేటులో పంజాగుట్ట డివిజన్ మొదటి స్థానం సాధించగా, బేగంపేట్ రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ రూరల్, సికింద్రాబాద్, ఆబిడ్స్, సరూర్‌నగర్, చార్మినార్ డివిజన్లు సైతం టాక్స్ వసూళ్లలో తమవంతు పాత్ర పోషించాయి. కేంద్ర కార్యాలయం నిర్ధేశించిన టార్గెట్‌ను పూర్తి చేయడంలో అన్ని డివిజన్లకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది పక్కా ప్రణాళికతో సమష్టిగా కృషి చేయడంతో రికార్డు స్థాయిలో పన్నులు వసూలయ్యాయయి. దీంతో బుధవారం ఆయా డివిజన్లలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కేక్‌లు కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఆరోగ్యకరమైన పోటీ... వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ పన్నుల వసూలుకు ప్రత్యేక యాప్‌లు రూపొందించడమేగాక అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు టార్గెట్లు విధిస్తూ ప్రోత్సహించడంతో నగరంలోని డివిజన్ల ఉద్యోగుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. దీంతో జూనియర్ అసిస్టెంట్ నుంచి డీసీటీఓ వరకు అన్ని స్థాయిల అధికారులు సమష్టిగా కృషి చేశారు. పన్నుల వసూలుకు సంబంధించిన డీలర్ల జాబితాలను రోజువారి యాప్‌లో ఆప్‌లోడ్ చేయడం లో సిబ్బంది ఉత్సాహంగా పని చేశారు. క్యాడర్‌తో సంబంధం లేకుండా అందరూ తమ వంతు పాత్ర పోషించడంతో పన్ను వసూళ్లలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గ్రేటర్ వాటా 80 శాతం... ఎక్సైజ్, పెట్రోలియం, పొగాకు ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలో లేకపోవడంతో 45 శాతం ఆదాయం వీటితో వస్తుంది. గ్రేటర్ పరిధిలోనే మూడు ఉత్పత్తుల కేంద్ర కార్యాలయాలు ఉండడంతో ఆదాయం ఎక్కువగా వస్తోంది. జీఎస్టీ పరిధిలోకి వచ్చే అన్ని రకాల ఉత్పత్తుల ప్రధాన కార్యాలయాలు నగరంలోనే ఉండటం, దిగుమతులు, హోల్‌సెల్ వ్యాపారాలు, భవన నిర్మాణ రంగానికి సంబందించిన వ్యాపార లావాదేవీలు ఇక్కడే ఎక్కువ జరుగుతున్నందున వాణిజ్య పన్నుల వసూలులో గ్రేటర్ వాటా ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రంలోని మిగితా నాలుగు డివిజన్లలో వ్యాపారలావాదేవీలు లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. సమష్టిగా సాధించారు.. ముఖ్య కార్యదర్శి, కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా ట్యాక్స్ వసూళ్లలో సిబ్బంది, అధికారులు ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించారు. యాప్‌ల రూపకల్పనతో పన్నుల వసూలు సులభతరమైంది. డివిజన్లో రోజువారి సమీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు టార్గెట్లను పూర్తి చేశాం. అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో డివిజన్ వృద్ధి రేటులో అగ్రస్థానంలో నిలిచింది. –కే. హరిత, పంజగుట్ట జాయింట్‌కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ -
వనపర్తి రాష్ట్రంలోనే ఫస్ట్‌ప్లేస్..
సాక్షి, వనపర్తి: ఆస్తిపన్ను వసూలులో జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో టాక్సీలు, ఇతర పన్నుల వసూళ్లు జోరందుకున్నాయి. యేటా మార్చినెలకు ముందు గ్రామాల్లో ఆస్తిపన్ను, ఇతర పన్ను వసూలు చేస్తారు. ఈ సారి ఆనవాయితీ ప్రకారం జిల్లాకు రూ.2.39 కోట్ల టాక్సీ, నాన్టాక్సీ టార్గెట్ ఇచ్చారు. జనవరి మాసంలోనే పంచాయతీ ఎన్నికలు రావటంతో ఆయా గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసేవారు. వారిని ప్రతిపాదించే వారికీ ఇంటిటాక్సీ, పంచాయతీ చెల్లించాల్సిన ఇతర చెల్లింపుల బాకాయి ఉండొద్దని ఎన్నికల అధికారులు నిబంధనలు విధించటంతో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న టాక్సీ, నాన్‌టాక్సీల మొత్తం చాలా వరకు వసూలయ్యాయి. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో వనపర్తి జిల్లాలో అత్యధికంగా సర్పంచ్, వార్డుసభ్యుల పదవి కోసం అభ్యర్థులు పోటీపడ్డారు. దీంతో జిల్లాకు ఆదాయం టాక్సీ, నాన్టాక్సీలు అంతేస్థాయిలో వసూలయ్యాయి. అర్ధరాత్రి ఒంటిగంట వరకు టాక్సీలు చెల్లించేందుకు నామినేషన్లు స్వీకరించే స్థలంలో క్యూలైన్లు కట్టిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి. రూ.1.91 కోట్ల వసూలు జిల్లా టాక్సీ, నాన్‌టాక్సీల వసూలు టార్గెట్ రూ.2.39 కోట్లు కాగా ఇప్పటి వరకు 14మండలాల పరిధిలోని 255 పంచాయతీలలో రూ.1.91 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 32 జిల్లాలో వనపర్తి జిల్లా టాక్సీలు, నాన్‌టాక్సీల వసూలులో మొదటి స్థానంలో ఉన్నట్లు జిల్లా పంచాయతీ అధికారులు వెల్లడిస్తున్నారు. గ్రామాల వారీగా టాక్సీ, నాన్టాక్సీ డబ్బులు వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శులు ఆయా పంచాయతీ ఖాతాలో ట్రెజరీ ద్వారా జమచేయాల్సి ఉంది. ఈ నెలాఖరులోపు బ్యాలెన్స్ ఉన్న రూ.48లక్షలు వసూలు చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలోఅభివృద్ధి కోసమే నిధులు గ్రామ పంచాయతీల వారీగా వసూలు చేసిన టాక్సీ, నాన్‌టాక్సీల మొత్తాన్ని ఆయా జీపీల ఖాతాలో ట్రెజరీ ద్వారా జమ చేస్తారు. పంచాయతీల పాలకవర్గం తీర్మానం మేరకు, ఆ నిధులను గ్రామంలో ఆయా అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.