సాక్షి, న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్‌టీ) వసూళ్లు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి నిరాశనే మిగిల్చాయి. వరుసగా రెండో మాసంలో కూడా జీఎస్‌టీ వసూళ్లు భారీ క్షీణతను నమోదు చేశాయి. డిసెంబర్ 25నాటికి జీఎస్‌టీ మొత్తం వసూళ్లు రూ. 80,808కోట్లుగా ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో వెల్లడించింది.
మంగళవారం ప్రకటించిన వివరాల ప్రకారం నవంబర్ నెల జీఎస్‌టీ వసూళ్లు 80,808 కోట్టుగా నమోదయ్యాయి. ఇందులో సెంట్రల్ జీఎస్‌టీ రూ.13,089 కోట్లు , స్టేట్ జీఎస్‌టీ రూ .18,650 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టీ రూ. 41,270 కోట్లు , రూ .7,798 కోట్లు కాంపన్ సేషన్ సెస్‌గా ఉన్నాయి.
సెప్టెంబరులో రూ. 92వేల కోట్లుగా నిలవగా అక్టోబర్ 83,346 కోట్ల రూపాయలకు పడిపోయాయి. జూలై నెలలో ఇవి రూ. 95,000 కోట్లకుపైగా ఉండగా, ఆగస్టులో 91,000 కోట్ల రూపాయలు. సెప్టెంబరు పరోక్ష పన్నుల వసూళ్లు 92,150 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.
Of the Rs. 80,808 crores collected under GST for the month of December, 2017, Rs. 13,089 crores have been collected as CGST, Rs. 18,650 crores has been collected as SGST, Rs. 41,270 crores has been collected as IGST and Rs. 7,798 crores has been collected as Compensation cess.
— Ministry of Finance (@FinMinIndia) December 26, 2017
Comments
Please login to add a commentAdd a comment