
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు గత నెలలో రూ. లక్ష కోట్లను దాటాయి. జీఎస్‌టీ వసూళ్లు మూడు నెలల తర్వాత లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇదే. గత ఏడాది నవంబర్‌లో రూ.97,637 కోట్లు, (ఈ ఏడాది అక్టోబర్‌లో రూ.95,380 కోట్లుగా) ఉన్న జీఎస్‌టీ వసూళ్లు ఈ ఏడాది నవంబర్‌లో 6 శాతం వృద్ధితో రూ.1.03 లక్షల కోట్లకు పెరిగాయి. 2017, జూలై నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే మూడో అత్యధిక వసూళ్లు. కాగా ఈ వసూళ్లు లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇది ఎనిమిదో నెల. అంతకు ముందు రెండు నెలల్లో ప్రతికూల వృద్ధిని నమోదు చేసిన జీఎస్‌టీ వసూళ్లు పండుగల డిమాండ్ పుణ్యమాని ఈ నవంబర్‌లో పెరిగాయి. వినియోగం పెరగడాన్ని, జీఎస్‌టీ అమలు మెరుగుపడటాన్ని పెరిగిన ఈ వసూళ్లు సూచిస్తున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment