సాక్షి, నెల్లూరు: వాణిజ్య పన్నుల శాఖ నెల్లూరు జోన్ (నెల్లూరు, ప్రకాశం జిల్లాలు)ఆదాయం భారీగా పెరిగినప్పటికీ, మరోవైపు నాన్ ఆర్గనైజింగ్ సెక్టార్లో పన్నుల ఎగవేత అంతే స్థాయిలో ఉన్నట్లు సమాచారం. 2012 ఆర్థిక సంవత్సరం లో 434 కోట్ల ట్యాక్స్ వసూలు కాగా 2013 లో అది 540 కోట్లకు చేరింది. ఈ లెక్కన వంద కో ట్ల ఆదాయం పెరిగినట్లే. అదే సమయంలో నా న్ ఆర్గనైజింగ్ సెక్టార్లో పన్నుల ఎగవేత సైతం అంతకు మించి ఉన్నట్లు తెలుస్తోంది.
జోన్ పరిధిలో పన్ను ఎగవేతదారులు నామమాత్రం గానే ఉన్నారని, దీనిని సైతం అధిగమించేం దుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం కనిపించడంలేదు. కొందరు అధికారుల అవినీతి పుణ్యమా అని ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో ముఖ్యంగా రైస్, ఆయిల్, ఇసుక, చైనా ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, దుస్తులు తదితర వస్తువుల అమ్మకాలు జీరో వ్యాపారంతో సాగుతున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు మిగిలిన వర్గాలు సైతం పెద్ద ఎత్తున పన్నులు ఎగవేస్తున్నట్లు సమాచారం. వారే కమర్షియల్ ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు తెలుస్తోంది.
కచ్చితంగా వ్యాపారం చేస్తే ఎక్సైజ్‌డ్యూటీ 12 నుంచి 16 శాతం, వ్యాట్ 14 శాతం, ఇన్‌కమ్ ట్యాక్స్ 30 శాతం పడుతుండడంతో దీనిని తప్పించుకునేందుకే వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వ్యాపారంలో అభివృద్ధి సాధించినప్పటికీ ట్యాక్స్ కట్టకుండా ఉండేందు కు వ్యాపార లావాదేవీలను పరిమితంగా చూపుతున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం నష్టపోతోంది. నెల్లూరు జోన్ (నెల్లూరు,ప్రకాశం)లో కమర్షియల్ టాక్స్ లెక్కల ప్రకారం 15 వేల మందికి పైగా వ్యాట్ డీలర్లు ఉన్నారు. కార్లు, ఫ్రిడ్జ్‌లు, ఏసీలు, కాస్మోటిక్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, ఫర్నీచర్, సిమెంట్‌తో పాటు బియ్యం, రైస్, ఐరన్ , స్టీల్, బంగారం, సిల్వర్, గ్రానైట్, ట్రాక్టర్లు తదితర రంగాలకు సంబంధించి కమర్షియల్ ట్యాక్స్ వసూలు కావాల్సి ఉంది. మొత్తంగా రూ 7.5 లక్షల నుంచి 50 లక్షల వరకూ టర్నోవర్ చేసే వ్యాపారులు మాత్రమే కమర్షియల్ టాక్స్ చెల్లించాలి. కానీ పలువురు వ్యాపారులు నెల్లూరు పరిధిలో పెద్ద ఎత్తున స్మగుల్ గూడ్స్ బిజినెస్ యథేచ్ఛగా సాగిస్తున్నారు. మొత్తంగా జీరో వ్యాపారం జోరు రోజురోజుకూ పెరుగుతోంది.
కొందరు రాజకీయ పార్టీల అండదండలతో ఈ వ్యాపారాలు చేస్తున్నారు. గతంలో 2002 నుంచి 2005 వరకూ వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌గా పనిచే సిన రేవతీరోహిణీ వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేయడంలో రాష్ట్రంలోనే రికార్డు సృష్టించారు. ఆతరువాత నెల్లూరు జోన్‌లో వ్యాపార లావాదేవీలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. గతంతో పోలిస్తే వాణిజ్య పన్నుల వసూలు భారీగా పెరగాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితి లేదు. కొందరు అధికారులు మామూళ్ల మత్తులో పడి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఉన్నతాధికారులు నెల్లూరు జోన్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వాణిజ్యశాఖ అధికారుల బృందం దీనిపై పరిశీలన జరుపుతున్నట్లు సమాచారం. సాధారణంగా లిక్కర్, పెట్రోల్, డీజిల్, బెవరేజెస్, పొగాకు, వాహనాలు తదితర ఆర్గనైజింగ్ సెక్టార్ల నుంచి ట్యాక్స్ దాదాపు మూడింతలు వస్తుంది.పైగా క్రమం తప్పకుండా కమర్షియల్ ట్యాక్స్ దానంతట అదే వస్తుంది. అధికారులకు ఎటువంటి శ్రమ అవసరం లేదు. దీంతో అధికారులు టాక్స్ లీకేజీలు అధికంగా ఉన్న నాన్‌ఆర్గనైజ్ సెక్టార్‌పై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి.
పన్ను ఎగవేత
Published Wed, May 21 2014 2:30 AM | Last Updated on Sat, Oct 20 2018 6:23 PM
Advertisement
Advertisement