సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం నెలకొన్నా జీఎస్టీ వసూళ్లు వరుసగా రెండో నెల డిసెంబర్‌లోనూ రూ. లక్ష కోట్లు దాటాయి. 2018 డిసెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 97,276 కోట్లు కాగా గడిచిన ఏడాది డిసెంబర్‌లో పన్ను వసూళ్లు 16 శాతం వృద్ధితో రూ. 1.03 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక 2019 నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 1,03,492 కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్టీ వసూళ్లలో అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏకంగా 124 శాతం వృద్ధి నమోదైందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నాగాలాండ్‌లో 88 శాతం, జమ్ము కశ్మీర్‌లో 40 శాతం మేర జీఎస్టీ వసూళ్లు పెరిగాయని తెలిపింది. ఇక గత నెలలో వసూలైన జీఎస్టీలో రూ. 19,962 కోట్లు సీజీఎస్టీకాగా, రూ. 26,792 కోట్లు ఎస్‌జీఎస్టీ, రూ. 48,099 కోట్లు ఇంటిగ్రేటెడ్ జీఎస్టీగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment