సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్‌టీ వసూళ్లు వరుసగా మూడవ నెలలో కూడా లక్ష కోట్ల మార్క్‌ను దాటాయి. మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి మందగించినప్పటికీ జీఎస్‌టీ వసూళ్లు బాగా పుంజుకున్నాయి. దీంతో మే నెలలో రూ. 100289 కోట్లు వసూలయ్యాయి. వార్షిక ప్రాతిపదికన వసూళ్లు, 6.67 శాతం పుంజుకోగా, ఆదాయం 2.21శాతం పెరిగి 94,016 కోట్ల రూపాయలుగా ఉంది. జీఎస్‌టీ వసూళ్లు ఏప్రిల్ మొత్తం రు. 1,13,865 కోట్లగా ఉండగా, మార్చిలో రూ. 1,06,577 కోట్లుగా నమోదయ్యాయి. శనివారం ఆర్థికమంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది.
సెంట్రల్ జీఎస్‌టీ ఆదాయం రూ .17,811 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ 24,462 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ ఆదాయం. రూ 49,891 కోట్లు. చెస్ వసూళ్లు రూ .8,125 కోట్లు. 2019 మే నెలలో 3,108 రిటర్న్స్ దాఖలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment