సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ వెల్లడించిన భారతీయులు దాఖలు చేసిన 2014-15 ఐటీ రిటన్‌ల వివరాల్లో పలు ఆశ్చర్యకర అంశాలు వెలుగుచూశాయి. రూ వంద కోట్ల పైగా పన్ను చెల్లించే రాబడి ఆర్జించినట్టు కేవలం ఒకే ఒక భారతీయుడు వెల్లడించినట్టు సమాచారం.
మొత్తం 4.1 కోట్ల మంది ఐటీ రిటన్‌లు దాఖలు చేయగా వారిలో రెండు కోట్ల మంది తమకు పన్ను వేసే రాబడి అసలేమీ లేదని వెల్లడించారు. మిగిలిన రెండు కోట్ల మంది సగటున రూ 42,456 మేర ఆదాయ పన్ను చెల్లించారు. కేవలం కోటి మంది పన్ను చెల్లింపుదారులు రూ లక్షకు మించి ఆదాయ పన్ను చెల్లించారు.రూ కోటి పైన పన్ను చెల్లించదగిన రాబడిని వెల్లడించిన వారు పదివేల మందికి లోపే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment