న్యూఢిల్లీ: అధిక ముందస్తు పన్ను చెల్లింపుల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 17వ తేదీ వరకూ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16.12 శాతం పెరిగి రూ.9,95,766 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్స్ విలువ గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 56.49% ఎగసి రూ.2.05 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వెరసి స్థూలంగా వసూళ్లు రూ. 12.01 లక్షల కోట్లుగా నమోదయ్యాయని గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇవి 21.48% అధికం.
విభాగాల వారీగా చూస్తే..
» నికర వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు 19 శాతం పెరిగి రూ. 5.15 లక్షల కోట్లకు చేరాయి.
» కార్పొరేట్ పన్ను వసూళ్లు 10.55 శాతం పెరిగి రూ. 4.52 లక్షల కోట్లకు చేరాయి.
» సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) ఆదాయం రూ.26,154 కోట్లు.
» ఒక్క అడ్వాన్స్ ట్యాక్స్ చూస్తే 22.61 శాతం పెరిగి రూ.4.36 లక్షల కోట్లుగా ఉన్నాయి. వ్యక్తిగత పన్నుల విషయంలో ఈ మొత్తాలు 39.22 శాతం పెరిగితే, కార్పొరేట్ పన్నుల విషయంలో ఈ పెరుగుదల 18.17 శాతంగా ఉంది.
» ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 13 శాతం పెరిగి రూ.22.12 లక్షల కోట్లకు చేరాలన్నది బడ్జెట్ లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment