పాడేరు: ఏజెన్సీలో అభివద్ధి పనుల పురోగతిపై ప్రతి నెలా 5న నివేదికను రూపొందించనున్నట్టు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఎల్.శివ శంకర్ వెల్లడించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా అభివద్ధి పనులకు ఈ నివేదిక దోహదపడుతుందన్నారు. అభివద్ధిపై ప్రజలకు ఒక అవగాహన కలుగుతుందన్నారు. మన్యంలో డయేరియా ప్రబలుతున్నందున దీని నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా వారపుసంతల్లో కుళ్లిన చేపలు, నిల్వ ఉంచిన మాంసం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈమేరకు తనిఖీలు చేపడతామన్నారు. ఇందుకు డిప్యూటీ తహసీల్దార్, వెటర్నరీ అసిస్టెంట్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో బందాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మన్యంలో ఇప్పటి వరకు ఐదు డయేరియా మరణాలను గుర్తించామని తెలిపారు. హుకుంపేట మండలం డూరువీధిలో ఒకరు, అడ్డుమండలో ఇద్దరు, డుంబ్రిగుడలో ఒకరు, చింతపల్లి మండలంలో ఒకరు చనిపోయినట్టు వివరించారు.సెంట్రల్ డ్రగ్‌స్టోర్ నుంచి అన్ని పీహెచ్‌సీలకు అవసరమైన మందులు సరఫరాకు చర్యలు చేపట్టామన్నారు. పీహెచ్‌సీల్లో అన్ని మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏడీఎంహెచ్‌వో వై.వేంకటేశ్వరరావును ఆదేశించారు. పంచాయతీల్లో పారిశుధ్యం మెరుగు పరచాలని సర్పంచ్‌లు, కార్యదర్శులకు సూచించారు. గతంతో పొలిస్తే మన్యంలో 41 శాతం వ్యాధుల తీవ్రత పెరిగిందన్నారు. గిరిజన గ్రామాల్లో మలేరియా, డయేరియా సోకితే ఐటీడీఏ హెల్ప్‌లైన్ 1800 4250 0004 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి 10.30 వరకు డయల్‌యువర్ పీవోకు గ్రామీణ సమస్యలపై సమాచారం అందించ వచ్చన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో కుమార్, ఏడీఎంహెచ్‌వో వై.వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.
సక్రమంగా మెనూ అమలు
గిరిజన విద్యార్థులకు అన్యాయం జరగకుండా మెనూ సక్రమంగా అమలు చేయాలని పీవో అన్నారు. ఏటీడబ్ల్యూవోలు, గురుకులం ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు చేయాలన్నారు. అనంతగిరి మండలంలో విద్యార్థులకు గుడ్డు పెట్టడం లేదని పత్రికల్లో వార్తలపై ఆరాతీశారు. గ్యాస్‌పొయ్యి పాడైపోవడంతో మధ్యాహ్నం భోజనం పెట్టడం లేదని అనంతగిరి ఏటీడబ్ల్యూవో వివరించారు. సీఆర్టీలు, పార్ట్ టైమ్ లెక్చరర్లు భర్తీపై ఆరాతీశారు. గిరిజన విద్యార్థులకు అంటువ్యాధులు సోకకుండా ఆశ్రమాలు, గురుకులాలు, కేజీబీవీల్లో వైద్యశిబిరాలు నిర్వహించే బాధ్యత ఏటీడబ్ల్యూవోలదే అన్నారు. కళాశాలల్లో లైబ్రరీ సదుపాయాలు కల్పించాలన్నారు. ఎంసెట్, ఎన్‌డీఏ, డీఎడ్ తదితర పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీ రియల్‌ను ఉంచాలన్నారు. 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుని విద్యార్థులకు స్వర్గీయ ఎస్‌ఆర్ శంకరన్ పేరు మీద క్విజ్‌పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎం.కమల, 11 మండలాల గురుకులం ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
పనుల ప్రగతిపై ప్రతి నెలా నివేదిక
Published Tue, Aug 2 2016 12:30 AM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
Advertisement
Advertisement