{పభుత్వ వైద్య సేవల్లో జిల్లా ఉత్తమం
మన వైద్యులను ఆహ్వానించిన బీజాపూర్ కలెక్టర్
బృందాన్ని పంపిన కలెక్టర్ కరుణ
వరంగల్ : ప్రభుత్వ వైద్య సేవల పరంగా జిల్లాలో కొన్ని నెలలుగా గణనీయమైన మార్పులు వచ్చాయి. ఏడాది క్రితంతో పోల్చితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు మెరుగయ్యాయి. ముఖ్యం గా కాన్పుల విషయంలో పురోగతి ఎక్కువగా ఉందని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ గుర్తిం చింది. వైద్య సేవల పరంగా రాష్ట్రంలోనే జిల్లా ఉత్తమంగా ఉందని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా కలెక్టర్‌కు తెలిపింది. ఆ జిల్లా కలెక్టర్ అయ్యాజ్ ఎఫ్ తాంబోలి స్వయంగా వైద్యుడు. అక్కడి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర కుటుం బ సంక్షేమశాఖ కమిషర్‌కు లేఖ రాశా రు. ప్రభుత్వ సేవలపరంగా మెరు గ్గా ఉన్న వరంగల్ వైద్య బృం దాన్ని బీజాపూర్‌కు పంపించాలని కోరా రు. దీంతో ఇదే విషయమై కుటుం బసంక్షేమ కమిషనర్.. కలెక్టర్ వాకాటి కరుణకు లేఖ రాశారు. కాగా, కలెక్టర్ కరుణ ఆదేశాల మేరకు జిల్లాలోని వైద్య బృందం బీజాపూర్‌కు వెళ్లింది. మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి(ఎంజీఎం)లో నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న పిల్లల వైద్యులు బలరాం, సురేందర్, స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదర్శంగా నిలిపిన వైద్యుడు మహేందర్ ఈనెల 25 బీజాపూర్‌కు వెళ్లారు. మూడు రోజుల పాటు అక్కడి వైద్యులకు తగు సలహాలు, సూచనలు అందించి 27న తిరిగి వచ్చారు.
ప్రత్యేక శిక్షణకు వినతి...
బీజాపూర్ జిల్లాలో 2.52 లక్షల మంది జనాభా ఉండగా, వైద్యులు 16 మంది మాత్రమే ఉన్నారని ఇక్కడి నుంచి వెళ్లిన వైద్య బృందం తెలిపింది. బీజాపూర్ జిల్లా కేంద్రంలో 35 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. అక్కడున్న 30 పడకల ఆస్పత్రిని 100 పడకల అస్పత్రిగా ఆ జిల్లా కలెక్టర్ తాంబోలి అభివృద్ధి చేశారు. 16 మంది వైద్యులలో తొమ్మిది మంది జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అక్కడి వారికి శిక్షణ అవసరమని భావించి మన జిల్లా వైద్యులను బీజాపూర్‌కు ఆహ్వానించారు. మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కోరారు. వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నందున తమ వద్ద విధులు నిర్వహించేందుకు వచ్చే వారికి రెండు లక్షల రూపాయల చొప్పున వేతనం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అక్కడి కలెక్టర్ చెప్పారని మన వైద్యులు తెలిపారు.