ప్రగతి పథంలో అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు | Progress on the path of Urban Cooperative Bank | Sakshi
Sakshi News home page

ప్రగతి పథంలో అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు

Published Mon, Sep 5 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

ప్రగతి పథంలో అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు

ప్రగతి పథంలో అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు

  • ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.134కోట్ల టర్నోవర్‌
  • బ్యాంకు చైర్మన్‌ ప్రదీప్‌రావు
  • కాశిబుగ్గ: నగరంలో 21ఏళ్ల క్రితం ఒకే బ్రాంచితో ప్రారంభమైన అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు ప్రస్తుతం ఆరు బ్రాంచిలతో విస్తరించి, రూ.134 కోట్ల టర్నోవర్‌తో ప్రగతి పథంలో సాగుతోందని బ్యాంకు చైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తెలిపారు. నగరంలోని స్వర్ణ ఫంక్షన్‌ ప్యాలెస్‌లో ఆదివారం ప్రదీప్‌రావు బ్యాంకు 20వ వార్షిక నివేదికను ప్రవేశపెట్టగా, వాటాదారులు, ఖాతాదారుల చప్పట్లతో ఆమోదించారు. ఈ సందర్భంగా బ్యాంకు పురోగతి, చేపడుతున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, వాటాదారులకు గల సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం వరకు బ్యాంకు రూ.82.75 కోట్ల డిపాజిట్లు, రూ.51.40 కోట్ల రుణాల మంజూరుతో రూ.134 కోట్ల టర్నోవర్‌ సాధించినట్లు తెలిపారు. కాశిబుగ్గలో సొంత భవనాన్ని నిర్మించామని, ఆర్‌బీఐ అనుమతితో 4 ఏటీఎంలను ఏర్పాటు చేసి, ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
     
    త్వరలోనే నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బ్యాంకు పురోభివృద్ధికి వాటాదారులు, ఖాతాదారులు సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు తోట జగన్నాథం, డైరెక్టర్లు పాలారపు కృష్ణమూర్తి, వేణుగోపాల్, కూరపాటి చంద్రమౌళి, తోట సంపత్‌కుమార్, గౌసొద్దీన్, నరేష్‌కుమార్, పవన్‌కుమార్, పాపిరెడ్డి, రమేష్‌గౌడ్, సృజన్‌కుమార్, హరినాథ్, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement