సాక్షి, అమరావతి: పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రహ్మణ్యం, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఏపీఐఐసీ ఈడీ ప్రతాప్ రెడ్డి, ఏపీ హై గ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఎండీ షన్ మోహన్, జాయింట్ డైరెక్టర్ ఇందిరా, పరిశ్రమల శాఖ సలహాదారులు కృష్ణ జి.వి గిరి, శ్రీధర్ లంకా ,పరిశ్రమల శాఖ అధికారులు, ఈడీబీ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈడీబీలో ఈ ఏడాది కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడంలో మరింత మెరుగ్గా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పరిశ్రమ పెట్టాలనుకునే సామాన్య ప్రజలకు కూడా అనువైన విధానాలను అందుబాటులోకి తేవాలని సీఎం జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనతో పాటే నైపుణ్యం, ఉపాధి కల్పనపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి గౌతమ్‌రెడ్డి సూచించారు.
చదవండి:
‘కేశినేని నాని.. పెద్ద గజదొంగ’
పచ్చనేతల కొత్త ఎత్తుగడ!
Comments
Please login to add a commentAdd a comment