
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరరాజా ప్రతినిధులు ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్లా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఏదో రకంగా బద్నాం చేయాలిని ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఈమేరకు మంత్రి అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కోసం ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారు. ఎల్లోమీడియా ఎన్ని జాకీలు పెట్టినా చంద్రబాబు లేవలేరు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ వ్యాపారం ఏపీలో ఉంది. ఆయనను ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం ఏనాడైనా ఇబ్బంది పెట్టిందా?. పారిశ్రామిక వేత్తలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రభుత్వం ఇబ్బంది పెడితే ప్రియ, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎలా నడుస్తున్నాయి?. ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్న దురుద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment