నెల్లూరులో గ్యాస్‌ పరిశ్రమ ఏర్పాటు పనులు షురూ.. | AG And P Gas Starts Works Of Gas Industries | Sakshi
Sakshi News home page

నెల్లూరులో గ్యాస్‌ పరిశ్రమ ఏర్పాటు పనులు షురూ..

Jul 10 2022 9:10 PM | Updated on Jul 10 2022 9:22 PM

AG And P Gas Starts Works Of Gas Industries - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటింటికీ పైప్‌లైన్‌ గ్యాస్‌ అందించేందుకు అనుమతులు పొందిన ఏజీ అండ్‌ పీ గ్యాస్‌ పరిశ్రమ పనులు షురూ చేసింది. రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి పట్టణాల్లో ఇంటింటికీ గ్యాస్‌ కనెక్షన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

పనుల పరిశీలన...
వెంకటరెడ్డి పాళెం పంచాయితీ పరిధిలోని ఓజ్లీలో ఏజీ అండ్‌ పీ గ్యాస్‌ పరిశ్రమ పనులను సూళ్లూరు పేట ఆర్డీఓ పరిశీలించారు. పరిశ్రమ నిర్మాణంలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది ఆయన సర్వే సిబ్బందితో కలిసి నిశితంగా సమీక్షించారు. చెరువులో గానీ,  గురుకుల పాఠశాల, వాకాటి వారి కండ్రిగ, రాజు పాలెం ఎస్టీకాలనీలకు సమీపంలో నిర్మాణాలు ఏమైనా చేపట్టారా అనే అనుమానాల నేపధ్యంలో ఈ పరిశీలన జరిపినట్టు ఆయన వెల్లడించారు. సందేహాల నివృత్తి కోసం పరిశ్రమ ప్రతినిధులు, గ్రామస్తులతో అధికారుల బృందం మాట్లాడింది. ఈ సందర్భంగా పరిశ్రమ ప్రతినిధులు తమ పరిశ్రమ ఏర్పాటు సంబంధిత వివరాలు అందించారు. 

ఓజ్లిలో ఎల్‌సీఎన్‌జీ స్టేషన్‌సన్నాహాలు
సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ (సీజీడీ) కంపెనీగా ఏజీ అండ్‌ పీ  ప్రథమ్‌కు 12 సీజీడీ లైసెన్‌లనుపెట్రోలియం– సహజవాయు నియంత్రణ మండలి (పీఎన్‌ జీఆర్‌బీ) మంజూరు చేసింది. వీటి ద్వారా దేశవ్యాప్తంగా 34 జిల్లాల్లో ప్రతి రోజూ వినియోగం కోసం గ్యాస్‌ను ఏజీ అండ్‌ పీ   అందిస్తుంది. అలా సంస్థ సరఫరా చేస్తోన్న ఓ  గ్రామమే నెల్లూరు జిల్లాలోని ఓజ్లి గ్రామం.జ్లీ వద్ద ఎల్‌సీఎన్‌జీ స్టేషన్‌ను ఏర్పాటుచేయడం కోసం పెట్రోలియం ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (పెసో), ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర  కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ; డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ అండ్‌ హెల్త్, బాయిలర్స్, ఫ్యాక్టరీస్‌ (డిష్‌); ద ఫైర్‌– స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌ (ఫైర్‌ ఎన్‌ ఓసీ), నెల్లూరు నగరాభివృద్ధి సంస్ధ (నుడా), అపెక్స్‌ సేఫ్టీ స్టాట్యూటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి  కంపెనీ అవసరమైన అన్ని అనుమతులను  తీసుకుంది. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అంగీకారం (సీటీఈ) సైతం పొందింది.  పరిశ్రమ ఏర్పాటులో వర్తించేటటువంటి అన్ని చట్టాలకూ, అదే విధంగా స్టెయినబల్‌ గ్యాస్‌ ఆర్ధిక వ్యవస్ధ సృష్టికి తాము కట్టుబడి ఉన్నామని సంస్థ ప్రతినిధులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement