
కరోనా వేళ వేలాది కంపెనీలు మూతపడ్డాయి. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 జూన్ 30 వరకు 15 నెలల్లో కార్పొరేట్ వ్యవహారాల శాఖ వద్ద నమోదైన కంపెనీల్లో 17,228 మూతపడినట్టు వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్‌ప్రకాష్ రాజ్యసభకు తెలిపారు. ఇందులో తమిళనాడు రాష్ట్రానికి చెందినవి 1,899 ఉన్నట్టు చెప్పారు.
ప్రస్తుతానికి నోటిఫై చేసిన 379 ప్రత్యేక ఆర్థిక మండళ్లు దేశంలో పనిచేస్తున్నట్టు తెలిపారు. అలాగే, 2014–20 మధ్య ఏడు ఆర్థిక సంవత్సరాల్లో దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 440 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment