ఏఎస్‌రావునగర్: మనసుకు నచ్చే ఆభరణాలను తయారుచేసే జోయాలుక్కాస్ సంస్థ తన నూతన షోరూమ్‌ను ఏఎస్‌రావునగర్‌లో బుధవారం ప్రారంభించింది. జోయాలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్, బాలీవుడ్ సినీ నటి కాజోల్ దేవగన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ.. జోయాలుక్కాస్ ద్వారా ఆత్మీయ కలయిక గొప్ప మధురానుభూతిని ఇచ్చిందన్నారు. జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, ఎండీ జోయాలుక్కాస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం తమకు ఎంతో ప్రత్యేకమైందన్నారు.
జోయాలుక్కాస్ షో రూమ్‌ను ప్రారంభిస్తున్న కాజోల్ దేవగన్, చిత్రంలో జోయాలుక్కాస్, జోళి జోయాలుక్కాస్
వినియోగదారుల సహకారం, నిరంతర ప్రోత్సాహం వల్లే ఇంతటిస్థాయికి చేరుకున్నామన్నారు. 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 200 షోరూమ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి కొనుగోలుపై ఉచిత బహుమతులు అందజేస్తామన్నారు. ఈ ఆఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని వినియోగదారులు వినియోగించుకోవచ్చన్నారు. దీంతోపాటు అభరణాల ఉచిత నిర్వహణ, ఏడాది ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. జోయ్ అలుక్కాస్ డైరక్టర్ జోళి జోయ్ అలుక్కాస్, రీజనల్ మేనేజర్ రాబిన్‌టాంబీ, డీజీఎం పీడీ. ఫ్రాన్సస్స్, బ్రాంచ్ మేనేజర్ జీన్స్, అసిస్టెంట్ బ్రాంచి మేనేజర్ జీవై సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాజోల్‌ను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు.
సందడి చేసిన కాజోల్
Published Thu, Apr 18 2019 7:17 AM | Last Updated on Thu, Apr 18 2019 7:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment