సాక్షి, సిటీబ్యూరో: మీ పాత బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి ప్రస్తుత మార్కెట్ ధరకు అనుగుణంగా నగదు ఇచ్చేందుకు జాయ్ అలుక్కాస్ షోరూమ్ సరికొత్త ఆఫర్‌ను పసిడి ప్రియుల ముందుకు తీసుకొచ్చింది. అలాగే పాత బంగారు ఆభరణాలను అత్యధిక విలువకు సరికొత్త బంగారం ఆభరణాల డిజైన్‌తో మార్చే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే జాయ్ అలుక్కాస్.కామ్ వెబ్‌సైట్‌లో ప్రత్యేకమైన కలెక్షన్లు అందుబాటులో ఉంచామని, తమకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. వినియోగదారులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న తేదీ అమలులో ఉన్న ధర, కొనుగోలు చేసినప్పడు ఉన్న ధర...రెండింటిలో ఏదీ తక్కువగా ఉంటే దాని ప్రకారం ధర చెల్లించవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment