జోయలుక్కాస్‌పై దేశవ్యాప‍్తంగా ఐటీ దాడులు | Jewellery Chain Joyalukkas Raided At Multiple Places In | Sakshi
Sakshi News home page

జోయలుక్కాస్‌పై దేశవ్యాప‍్తంగా ఐటీ దాడులు

Published Wed, Jan 10 2018 10:30 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

Jewellery Chain Joyalukkas Raided At Multiple Places In - Sakshi

సాక్షి, చెన్నై:  ప్రముఖ జ్యూయలరీ సంస్థ జోయలుక్కాస్‌కు ఆదాయ పన్నుశాఖ షాక్‌ ఇచ్చింది.  దేశవ్యాప్తంగా ఐడీ  సోదాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలతో సంస్థకు చెందిన పలు కార్యాలయాల్లో ఆదాయ ప​న్ను అధికారులు  దాడి చేశారు. హైదరాబాద్‌, కేరళ, బెంగళూరు,ముంబై తదితర నగరాల్లో ఏకకాలంలో షాపులు  మూసివేసి మరీ సోదాలు  నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి ఈ సోదాలు ప్రారంభించగా, షాపులు మూసేసి మరీ అధికారులు సోదాలు చేపట్టారు. తమిళనాడుతో పాటు అనేక రాష్ట్రాల్లో జ్యూయలరీ చైన్ జోయలుక్కాస్‌కు చెందిన షోరూంలలో అధికారులు తనిఖీలు చేపట్టారు.  

ఇప్పటికి 4 లాకర్లు,  20 దస్తావేజులు, అధికారికంగా రూ.4 కోట్లు, 60 లక్షల విలువైన  డాక్యుమెంట్లను అధికారులు గుర్తించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సీనియర్ ఆదాయపు పన్ను అధికారి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. కాగా గల్ఫ్ దేశాలలో స్థాపించబడిన జ్యూయలరీ మేజర్‌ జోయలుక్కాస్‌ గ్రూపు ఒమన్, బహ్రెయిన్, ఇండియా, యూకే  సహా 11 దేశాలలో 130 షోరూంలను నిర్వహిస్తోంది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement