ప్రతీకాత్మక చిత్రం
చెన్నై : నగరంలో భారీగా నల్లధనం బయటపడింది. ఓ ప్రముఖ టైల్స్ అండ్ శానిటరీవేర్ తయారీ కంపెనీపై ఇన్‌కమ్ టాక్స్ అధికారులు జరిపిన దాడిలో 220 కోట్ల రూపాయల లెక్కకు చూపని డబ్బు వెలుగుచూసింది. ఫిబ్రవరి 26వ తేదీన జరిపిన సోదాల్లో మొదట రూ.8.30 కోట్లు సీజ్ చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ అధికారులు తెలిపారు. టైల్స్‌కు సంబంధించి లెక్క చూపని కొనుగోలు, అమ్మకాలు జరిగినట్లు గుర్తించారు. ఇందుకోసం ఓ రహస్య ఆఫీసుతో పాటు, ఓ సాఫ్ట్‌వేర్‌ను సైతం ఉపయోగించినట్లు కనుగొన్నారు.
యాభై శాతానికి పైగా లావాదేవీలు రికార్డు చేయలేదని తెలిపారు. మొత్తం 220 కోట్ల రూపాయల లెక్కకు చూపని డబ్బును గుర్తించామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి ఈ డబ్బును ఉపయోగించాలనుకున్నారా అన్న దానిపై విచారణ చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment