తమారా డిసూజా గురించి సింపుల్‌గా ఒక్కమాటలో చెప్పలేం! ఆమె.. ప్రతిభా గని! యాక్ట్రెస్, మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టయిలిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, గాయని, ఉకులెలె ప్లేయర్ కూడా!
ఆ గుర్తింపు తమారా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దాంతో నటననే ఫుల్‌టైమ్ జాబ్‌గా ఎంచుకుంది. ఆమె తాజా చిత్రం ‘లవ్ సితారా’ జీ5లో స్ట్రీమ్ అవుతోంది.
తమారా తన నటనతోనే కాదు గాత్రంతోనూ ఆకట్టుకుంటోంది. ప్రీతమ్, షాన్, నీతీ మోహన్, ఏఆర్ రెహమాన్ లాంటి మహామహులతో కలసి పాడుతోంది. నటన, సంగీతం, మేకప్, హెయిర్ స్టయిలింగ్‌లతో క్షణం తీరికలేని షెడ్యూల్స్‌లో ఎప్పుడన్నా సమయం చిక్కితే సోలో ట్రావెల్‌కి వెళ్లిపోతూ, ఉకులెలె ప్లే చేస్తూ ఆస్వాదిస్తోంది.
తమారా .. ముంబైలో పుట్టి, పెరిగింది. కామర్స్ అండ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్. న్యాయశాస్త్రంలోనూ డిగ్రీ పుచ్చుకుంది.
చదువైపోగానే ‘రెయిన్ డ్రాప్ మీడియా’ సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్‌గా జాయిన్ అయింది. విద్యా బాలన్, శ్రుతి హాసన్, ఫరా ఖాన్, బొమన్ ఇరానీ లాంటి యాక్టర్స్ కోసం పనిచేసింది. అంతేకాదు రేస్ 2, వికీ డోనర్, హౌస్‌ఫుల్ 2 లాంటి సినిమాలకు పీఆర్ ఈవెంట్స్‌నూ నిర్వహించింది.
ఏడాది తర్వాత ఆమె ఖీఐ్క ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో చేరింది.. మార్కెటింగ్, ప్రమోషన్స్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా. ఆమె పనితీరుకు ముచ్చటపడిన వైకింగ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ సంస్థలో ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. సద్వినియోగం చేసుకుంది తమారా. ఇందులో ఉన్నప్పుడే ఆమె చురుకుదనం, సమయస్ఫూర్తికి మెచ్చి పలు యాడ్ ఏజెన్సీలు వాణిజ్య ప్రకటనల్లో మెరిసే చాన్స్‌నిచ్చాయి. అలా తమారా.. తనిష్క్, టైటాన్, డ్యూరోఫ్లెక్స్ వంటి ఫేమస్ బ్రాండ్స్ కమర్షియల్ యాడ్స్‌లో కనిపించింది.
ఆ కమర్షియల్ యాడ్సే తమారా వెబ్‌స్క్రీన్ ఎంట్రీని ఖరారు చేశాయి. మేడిన్ హెవెన్, లిటిల్ థింగ్స్, హెలో మినీ లాంటి వెబ్ సిరీస్‌లలో నటించే అవకాశాన్నిచ్చాయి. ఆమె నటనకు సిల్వర్‌స్క్రీన్ కూడా స్పేస్ ఇచ్చింది. ‘క్లాస్ ఆఫ్ 83’ , ‘అటాక్’ సినిమాల్లో ప్రధాన పాత్రల్లో మెప్పించి, విమర్శకుల ప్రశంసలు పొందింది.
యాడ్స్, వెబ్, సినిమా.. ఈ మూడిట్లో నటించే అవకాశం.. నాకు యాదృచ్ఛికంగా అందిన వరమని చెప్పుకోవచ్చు! సంగీతం, మేకప్, హెయిర్ స్టయిలింగ్ వగైరా వగైరా.. నేను ఇష్టపడి, నేర్చుకుని ఆ దిశగా ప్రయత్నిస్తే సాధించినవి. కానీ నటన విషయం అలాకాదు. నటిని కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అది అనుకోకుండా జరిగింది. కంటిన్యూ అవుతోంది.
– తమారా డిసూజా
Comments
Please login to add a commentAdd a comment