
రంగుల ప్రపంచంలో.. ఎవరు ఏం కావాలన్నది పరిశ్రమే నిర్ణయిస్తుందంటారు. ఈ మాట సోనల్ పవార్ జీవితంలో అచ్చంగా నిజం.. గ్రేట్ సింగర్‌గా ఎదగాలనుకున్న ఆమెను.. బిజీ యాక్ట్రెస్‌గా మార్చింది ఇండస్ట్రీ. ప్రస్తుతం తనలో దాగిన నటనకు మెరుగులు దిద్దుతూ వరుస సీరియల్స్, సిరీస్‌తో దూసుకుపోతోంది..
సొంత ఊరు డెహ్రడూన్. చిన్నప్పుడే సింగర్ కావాలని ఫిక్స్ అయిపోయింది. స్కూల్లో ప్రేయర్ బెల్ కొట్టినా.. ఫ్రెండ్స్‌కు బోర్ కొట్టినా తన పాటే వినబడేది. పలు సంగీత పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. అదే స్ఫూర్తితో ప్రసిద్ధ రియాలిటీ షో ‘సరిగమప’ లోనూ పాల్గొంది. విజేతగా నిలవకపోయినా, వెంటనే ఓ సినిమాలో పాడే చాన్స్ కొట్టేసింది.
దురదృష్టవశాత్తు ఆ సినిమా రిలీజ్ కాలేదు. అవకాశాల కోసం ఆమె ప్రయత్నమూ ఆగలేదు. షోలో వచ్చిన పాపులారిటీ నెమ్మది నెమ్మదిగా తగ్గి, సింగర్‌గా స్థిరపడకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లింది.
ఒకరోజు తను పాడిన పాట.. టీవీలో రిపీట్ ఎపిసోడ్‌లో వినబడుతోంది. అప్పుడే ఆమె ఓ విషయాన్ని గమనించింది. అక్కడికి వచ్చిన అతిథుల్లో కొంతమంది నటీమణులు కూడా ఉండటం. వారికి సింగర్స్ కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం.
రిపీట్ ఎపిసోడ్ ఇచ్చిన ప్రేరణతో నటిగా మారింది. అదృష్టం ఆమె తలుపు తట్టినట్లు కొద్దిరోజుల్లోనే స్టార్ ప్లస్‌లో ప్రసారమమ్యే ‘కసౌటీ జిందగీ కీ’ సీరియల్‌లో అవకాశం లభించింది.
సింగర్‌గా కాకపోయినా, నటిగా మంచి సక్సస్ సాధించింది. వెబ్ దునియాలోకి అడుగుపెట్టి ‘గందీ బాత్’, ‘మాయ–2’, ‘క్యాండీ’ సిరీస్‌లతో అలరిస్తోంది.
చదవండి: పాకిస్తానీ క్రికెటర్ మొహిసిన్ ఖాన్ వివాహ బంధం.. అలా.. ముగిసింది!
Comments
Please login to add a commentAdd a comment