నా గొంతు తన గొంతులాగే ఉందన్నారు | Palomi Ghosh Interview In Sakshi Funday | Sakshi
Sakshi News home page

నా గొంతు తన గొంతులాగే ఉందన్నారు

Sep 20 2020 7:02 AM | Updated on Sep 20 2020 7:02 AM

Palomi Ghosh Interview In Sakshi Funday

‘హేయ్‌ .. నీ గొంతు అచ్చం నా గొంతులాగే ఉంది’ అన్నది కాజోల్‌.. ఆమె పాట విని.  ‘హెలికాప్టర్‌ ఈలా’ సినిమాలో కాజోల్‌ కోసమే పాడిన పాట అది.  ఆ గాయని పాలోమి ఘోష్‌. నటీమణి కూడా. నెట్‌ఫ్లిక్స్‌ వీక్షకులకు ఆమె బాగా ఎరుక. ‘టైప్‌రైటర్‌’లో ముఖ్య భూమిక  పాలోమిదే. 

  • వడోదరాలో పుట్టి, అమెరికాలో పెరిగిన ఈ బెంగాలీ వనిత నార్త్‌ కరోలీనా స్టేట్‌ యూనివర్సిటీలో అప్లయిడ్‌ మ్యాథ్స్‌లో డిగ్రీ చదివింది. సెకండియర్‌లో ఉన్నప్పుడు నాటకాల్లో నటించడం మొదలుపెట్టింది. 
  •  అమెరికాలోనే ఓ బిజినెస్‌ అనలిటికల్‌ కంపెనీలో కొన్నాళ్లు ఉద్యోగం చేసి ఇండియాకు వచ్చింది. ‘నటన’ కెరీర్‌గా ఎంచుకోవాలనే ఉద్దేశంతో మాత్రం కాదు. 
  • ముంబై వచ్చాక అనుకోకుండా అనుపమ్‌ ఖేర్‌ యాక్టింగ్‌ స్కూల్‌ ‘యాక్టర్‌ ప్రిపేర్స్‌’లో జాయిన్‌ అయింది. కమర్షియల్‌ యాడ్స్‌లో అవకాశాలు రావడంతో సరదాపడింది. ఆ యాడ్స్‌ చూసిన సినిమా సర్కిల్స్‌ నుంచి సినీ అవకాశాలూ తలుపు తట్టడంతో నటనే ఆమె కెరీర్‌ అయింది.
  • 2009లో ‘ది వెయిటింగ్‌ సిటీ’ అనే హాలీవుడ్‌ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. తర్వాత  ‘నచోమ్‌ ఇయా కుంపాసర్‌’ అనే కొంకణి సినిమాలోనూ నటించింది. నేపథ్య గాయనిగా గొంతు సవరించుకుంది. ఇందులోని తన అభినయానికి జాతీయ పురస్కారమూ అందుకుంది. 
  • ఓటీటీ డెబ్యూ.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘సెన్స్‌ 8’తో.  తర్వాత ‘ట్రైస్ట్‌ విత్‌ డెస్టినీ’, ఆల్ట్‌ బాలాజీలో ‘మిషన్‌ ఓవర్‌ మార్స్‌’ ఎట్‌సెట్రా. బాగా పేరు తెచ్చింది మాత్రం టైప్‌రైటరే.
  • మీరా నాయర్‌ తీసిన సంగీతనాటకం ‘మాన్‌సూన్‌ వెడ్డింగ్‌’లోనూ పాలుపంచుకుంది. 
  • ఓ వైపు నటిగా కొనసాగుతూనే ఇంకోవైపు నేపథ్య గాయనిగానూ బిజీ అవుతోంది. అలా చేజిక్కించుకున్న సినిమానే ‘హెలికాప్టర్‌ ఈలా’.
  • పాలోమి ఫిల్మోగ్రఫీ.. గాంధీ ఆఫ్‌ ది మాంత్, ముక్తి భవన్, కె సెరా సెరా, శాటిలైట్‌ శంకర్, కడక్‌ మొదలైనవి. 
  • మాతృభాష బెంగాలీ. ఇంగ్లిష్‌తోపాటు గుజరాతీ, మరాఠీ, హిందీ, కొంకణి భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడుతుంది పాలోమి ఘోష్‌.
  • ‘‘చిన్నప్పుడు పాత హిందీ పాటలు పాడుతూ మా అమ్మను బాగా ఎంటర్‌టైన్‌ చేసేదాన్ని. నా ఉత్సాహాన్నీ చూసి మ్యూజిక్‌ క్లాస్‌లో జాయిన్‌ చేశారు మా పేరెంట్స్‌’’ అంటుంది పాలోమి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement