ఫ్యాషన్ బ్రాండ్స్ అన్ని చాలా వరకు కాలుష్య కారకాలే అని చెప్పాలి. హ్యాండ్ బ్యాగ్ దగ్గర నుంచి వాడే ప్రతి వస్తువులో ఏదో రకంగా ప్లాస్టిక్, లెథర్ వంటి వస్తువులతోనే తయారు చేస్తారు. పర్యావరణానికి హాని లేకుండా చేసే వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్‌తో కొరతను భర్తీ చేస్తోంది ముంబైకి చెందిన సుప్రియ శిర్సత్ సతమ్. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్‌తో అందరీ దృష్టిని ఆకర్షించింది. ఆయా ఫ్యాషన్ బ్రాండ్‌లను ప్రముఖ సెలబ్రెటీలు సైతం ఆదరించారు. దీని ఫలితంగా గ్రామాల్లో ఉండే వేలమంది కళాకారులకు ఉపాధి లభించినట్లయ్యింది. సుప్రియ ఎలా ఈ రంగంలోకి వచ్చింది, ఆమె ఏవిధంగా వీటిని ఉత్పత్తి చేసిందంటే..
సుప్రియా ఇంతవరకు మార్కెట్‌లోకి రాని వేగన్‌కి సంబంధించిన ఫ్యాషన్ బ్రాండ్‌లు తీసుకురావాలని అనుకుంది. పర్యావవరణానికి హాని కలిగించనటువంటి మంచి ఉత్పత్తులు తీసుకుని రావాలనుకుంది. అందుకోసం సహజ ఫైబర్‌లతో చేసే ఉత్పత్తులను ప్రోత్సహించింది. అందులో భాగంగా అరటిచెట్టు బెరడు, వాటి పళ్ల తొక్కలతో తయారు చేసే ఉత్పత్తులకు శ్రీకారం చుట్టింది. తొలుత ముందుగా స్మాల్ కీపింగ్ యూనిట్(ఎస్కేయూ)గా ప్రారంభించింది. అవే ఇప్పుడు ముంబైలో 200 ఎస్కేయూ యూనిట్‌లుగా విస్తరించాయి. ప్రారంభంలో కార్క్ హ్యాండ్ బ్యాగ్‌లు, వాలెట్‌లతో ప్రారంభమైంది.
ఇప్పుడు పురుషులు, మహిళలు, పిల్లలకు సంబంధించిన వాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, ఆభరణాలను కూడా అందిస్తోంది. తన ఉత్పత్తులకు "ఫోర్ట్" అనే బ్రాండ్ పేరుతో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. మార్కెట్‌లో కూడా ఈ బ్రాండ్‌కి మంచి స్పందన వచ్చింద. ఈ బ్రాండ్ రాజస్తాన్, మహారాష్ట, తోసహా దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 300 మంది గ్రామీణ మహిళా కళాకారులకు చేయూతనిచ్చింది. బ్రాండ్ ప్రారంభంలో కార్క్ హ్యాండ్‌బ్యాగ్‌లు మరియు వాలెట్‌లతో ప్రారంభమైంది మరియు ఇప్పుడు పురుషులు, మహిళలు, పిల్లలకు వాలెట్లు, టోట్ బ్యాగ్‌లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, ఆభరణాలను అందిస్తోంది. ఈ ఫ్యాషన్ బ్రాండ్స్‌ని విక్కీ కౌశల్, కార్తీక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్రాతో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ధరించారు.
సతమ్ నేపథ్యం..
సతమ్ మార్కెటింగ్‌లో ఎంబీఏ చేసిన ఇంజనీర్. జెట్ ఎయిర్‌వేస్‌లో మొబైల్ కామర్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఒక దశాబ్దం పాటు పనిచేసింది. సతమ్‌కి కళ, క్రాప్ట్ అంటే మంచి ఆసక్తి ఉంది. ఆమె కుటుంబ నేపథ్యం కూడా హస్తకళాకారులతో పనిచేసే టెక్స్‌టైల్ రంగం కావడంతో ఆమె అనూహ్యంగా ఇటువైపుకి మళ్లింది. ఫ్యాషన్ పరంగా సౌందర్య సాధానాలు సహజసిద్ధమైన వాటితో తయారు చేయని బ్రాండ్‌లు లేకపోవడాన్ని గమనించింది. తానే ఎందుకు వాటిని ఉత్పత్తి చేయకూడదన్న ఆలోచన నుంచి పుట్టింది ఈ "ఫోర్ట్ బ్రాండ్". 2019లో కేవలం లక్షరూపాయలతో ఈ ఫోర్ట్‌ని ప్రారంభించింది. తాను సహజసిద్ధ ప్రొడక్ట్‌లను తయారు చేసేందుకు చాలా సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది సతమ్.
అరటిపండు వేసవికాలం, వానాకాలాల్లో అది జీర్ణమైనప్పడూ ఏర్పడే మచ్చల ఆధారంగా దీన్నే మెటీరియల్‌గా తీసుకోవాలని భావించానని చెప్పింది. హ్యాండ్ బ్యాగ్‌ల తయారీకి జంతువుల తోలుకి ప్రత్యామ్నాయం ఓక్ చెట్ల నారను ఉపయోగిస్తాం. ఇక అరటి చెట్టుని పండ్లను వినియోగించేసిన తర్వాత కొట్టేస్తారు కాబట్టి వాటి నారతో బ్యాగ్‌లు వ్యాలెట్‌లను తయారు చేస్తాం. దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదు. ఇక ఆభరణాల విషయానికి వస్తే..బెరడులతో పింగాణీ, 18-క్యారెట్ బంగారం లేదా మిశ్రమ లోహం వంటి ఇతర ప్రీమియం మెటీరియల్‌ల కలయికతో విలక్షణంగా రూపొందిస్తున్నాం అని సతమ్ వివరించింది.
బ్రాండ్ ధరలు ఎలా ఉంటాయంటే..
ఈ బ్రాండ్‌కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్‌ల ధర రూ. 4500 నుంచి 14,000 వరకు ఉంటుంది. ఇక ఆభరణాల ధర రూ. 800 నుంచి రూ. 17,000 వరకు ఉంటుంది.ఈ ఫోర్ట్ బ్రాండ్‌తో సతమ్ మంచి సక్సెస్‌ని అందుకుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం ఆరుగురు సభ్యలుతో కూడిన బృందంతో పనిచేస్తుంది. ఈ బ్రాండ్ గడ్డి, జనపనారతో తయారు చేసే బ్రాండ్‌లతో పోటీపడుతుండటం గమనార్హం. ఈ ఫోర్ట్ బ్రాండ్ 2022లో ఉత్తమ వేగన్ వాలెట్‌ల పరంగా పెటా వేగన్ ఫ్యాషన్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ బ్రాండ్ ఉత్పత్తులు తన వెబ్‌సైట్ ద్వారా మాత్రమే కాకుండా అమలా ఎర్త్ వంటి సముచిత ఈకామర్స్ ఫ్లాట్ ఫామ్‌ల ద్వారా కూడా విక్రయిస్తోంది. ఆఫ్‌లైన్‌లో కూడా విక్రయించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై వంటి నగరాల్లో విక్రయిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment