ఆదిత్య అల్లూరి, అనికా రావు జంటగా లక్ష్మీ చలన చిత్ర పతాకంపై వివేక్ వర్మ దర్శకత్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తోన్న సినిమా స్వయంవద. ఈ సినిమాను ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ‘స్వయంవద సినిమా టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో సినిమా కూడా అంతే పవర్ ఫుల్ గా వుంటుందనుకుంటున్నాను. ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను.ఆల్ ది బేస్ట్ స్వయంవద చిత్ర యూనిట్’ అన్నారు.
చిత్ర దర్శకుడు వివేక్ వర్మ మాట్లాడుతూ.. ‘స్వయం వద’ సినిమా ఫస్ట్ లుక్ ను మాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ గారు ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. స్వయంవద అనేది సంస్కృత పదం. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. తన గురించి తానే సర్వస్వం అనే ఓ పాత్ర గురించి సినిమాలో చెప్పబోతున్నా. ఇందులో హీరోయిన్ అనికా రావు మొత్తం 6 గెటప్స్ లో కనిపిస్తుంది. హీరో ఆదిత్య అల్లూరి కొత్తవాడైనా చక్కగా నటించాడు. అందరికీ నచ్చే విధంగా కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ గా తెరకెక్కించాం. టెక్నికల్ గాను సినిమా హైలైట్ గా ఉంటుంది’ అన్నారు.
నిర్మాత రాజా దూర్వాసుల మాట్లాడుతూ.... సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి.టీజర్ ను ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తాము.సినిమాను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్ తో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
Published Fri, Feb 1 2019 3:40 PM | Last Updated on Fri, Feb 1 2019 3:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment